మరోసారి నాగచైతన్యతో స్క్రీన్‌ పంచుకోనున్న రాశిఖన్నా

3 Apr, 2021 03:22 IST|Sakshi

‘వెంకీమామ’ సినిమాలో జంటగా కనిపించి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నాగచైతన్య, రాశీ ఖన్నా. అంతకుముందు అక్కినేని ఫ్యామిలీ నటించిన ‘మనం’ చిత్రంలో రాశీఖన్నా ఓ గెస్ట్‌ రోల్‌ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు చైతూతో ఆమె మరోసారి సిల్వర్‌ స్క్రీన్‌ని షేర్‌ చేసుకోనున్నారని సమాచారం. నాగచైతన్య హీరోగా విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘థ్యాంక్యూ’.

ఈ సినిమాలో మహేశ్‌బాబు అభిమానిగా కనిపిస్తారు నాగచైతన్య. కథ ప్రకారం ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. ఒక నాయికగా రాశీ ఖన్నాను ఎంపిక చేశారని సమాచారం. కథలో నాగచైతన్య యంగ్‌ ఏజ్‌లో ఉన్న సన్నివేశాల్లో అతనికి జోడీగా రాశీ కనిపిస్తారట. ఇంకా ఇద్దరు కథానాయికల జాబితాలో మాళవికా నాయర్, నభా నటేశ్‌ పేర్లు వినిపిస్తున్నాయి. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు