అలాంటివారిని దూరం పెడతాను: రాశీ ఖన్నా

3 Jul, 2022 07:13 IST|Sakshi

రాశీ ఖన్నా ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ‘పక్కా కమర్షియల్‌’లో ఆమె చేసిన క్యారెక్టర్‌కి ప్రశంసలు దక్కడం ఓ కారణం అయితే.. చేతి నిండా సినిమాలు ఉండటం మరో కారణం. ‘బిజీగా ఉండటమే కదా కావాల్సింది’ అంటున్నారు ఈ బ్యూటీ. గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా మారుతి  దర్శకత్వంలో తెరకెక్కిన ‘పక్కా కమర్షియల్‌’ ఈ నెల 1 విడుదలైంది. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌– యూవీ క్రియేషన్స్‌పై బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమాలో తన పాత్రకు లభిస్తున్న ప్రశంసలు, ఇతర విశేషాల గురించి రాశీ ఖన్నా ఈ విధంగా చెప్పారు. 

‘పక్కా కమర్షియల్‌’లో నమస్కారం చేసేటప్పుడు సెలబ్రిటీలు ఇంతకన్నా బెండ్‌ కాకూడదని అంటారు.. ఓ సెలబ్రిటీగా రియల్‌ లైఫ్‌లో మీరు.. ?
రాశీ ఖన్నా: అసలు నన్ను నేను సెలబ్రిటీలా ఎప్పుడూ అనుకోలేదు. సెలబ్రిటీ, కామన్‌ పీపుల్‌ అనే తేడా నాకు ఉండదు. పైగా ఎప్పట్నుంచో నా ఆలోచనలు స్పిరిచ్యువల్‌గా ఉంటాయి కాబట్టి ‘స్టేటస్‌’కి ప్రాధాన్యం ఇవ్వను. మనం కెరీర్‌లో ఎంతైనా సాధించవచ్చు. కానీ అది నెత్తికెక్కించుకుంటే కష్టం. 

ఒక స్థాయికి చేరుకున్నాక స్టేటస్‌ మెయింటైన్‌ చేయాలని అనేవాళ్లు మన చుట్టూ ఉండటం కామన్‌ కదా.. ?
అలాంటివి చెప్పడానికి చాలామంది ఉంటారు. అయితే నాకంటూ ఒక మైండ్‌ ఉంది. అది చెప్పిన ప్రకారమే ఫాలో అవుతాను. ఒకవేళ నా మైండ్‌కి ఎక్కించాలని ఎవరైనా ట్రై చేస్తే వాళ్లను దూరం పెడతాను.  

 ‘పక్కా కమర్షియల్‌’లో టీవీ ఆర్టిస్ట్‌గా కామెడీ పండించారు.. సీరియల్స్‌ చూస్తారా? 
చిన్నప్పుడు చూసేదాన్ని. యాక్చువల్‌గా కథ చెప్పినప్పుడు అల్లు అరవింద్‌గారు, మారుతిగారితో ఈ క్యారెక్టర్‌ని నేను చేయగలనా? అనిపిస్తోంది అన్నాను. ఎందుకంటే నాది ఫుల్‌ ప్లెడ్జ్‌డ్‌ కామెడీ క్యారెక్టర్‌. కామెడీ చేయడం కష్టం. కానీ ఒక ఆర్టిస్ట్‌గా చేయాలని ఫిక్సయ్యాను. సినిమా చూసి, అల్లు అరవింద్‌గారు ‘యాక్టింగ్‌ చాలా బాగుంది’ అన్నారు. ఆడియన్స్‌కి కూడా నా నటన నచ్చినందుకు హ్యాపీగా ఉంది. 

మరిన్ని వార్తలు