తంగేడు పువ్వు

10 Sep, 2020 06:05 IST|Sakshi
కృష్ణకుమార్, శ్రీనివాస్‌రెడ్డి, వీవీ వినాయక్, శ్రీలేఖ

అనురాగ్, ముస్కాన్‌ సేథీ జంటగా నటించిన చిత్రం ‘రాధాకృష్ణ’. ‘ఢమరుకం’ శ్రీనివాస్‌ రెడ్డి సమర్పణలో ఈ చిత్రాన్ని హరిణి ఆరాధ్య క్రియేషన్స్‌ పతాకంపై పుప్పాల సాగరిక నిర్మించారు. టి.డి. ప్రసాద్‌వర్మ దర్శకత్వం వహించారు. యం.యం. శ్రీలేఖ జన్మదినం సందర్భంగా ఈ చిత్రంలోని ‘తంగేడు పువ్వు...’ పాటను దర్శకుడు వీవీ వినాయక్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నిర్మల్‌ బొమ్మల నేపథ్యంలో లవ్‌స్టోరీని తెరకెక్కించారు ప్రసాద్‌వర్మ.

హీరో అనురాగ్‌కి ఈ సినిమాతో మంచి పేరు రావాలి. సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. చిత్రనిర్మాణ సారధి కృష్ణకుమార్‌ మాట్లాడుతూ– ‘‘ఇప్పటికే విడుదలైన ‘కొట్టుకొట్టు..’ అనే సాంగ్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ‘తంగేడు పువ్వు...’ పాటకు కూడా మంచి పేరు వస్తుందనుకుంటున్నా. ఈ పాట రాసిన అనంత్‌ శ్రీరామ్‌కి, పాట పాడిన శ్రుతికి అభినందనలు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సమర్పకులు శ్రీనివాస్‌ రెడ్డి, యం.యం. శ్రీలేఖ, హీరో అనురాగ్, దర్శకుడు టి.డి. ప్రసాద్‌వర్మ, రాథోడ్‌ రాంనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు