లవ్‌లో పడేస్తారు!

18 Oct, 2020 02:37 IST|Sakshi

అభిమాన హీరో పుట్టినరోజు వస్తోందంటే అభిమానుల్లో ఎక్కడలేని సంతోషం నెలకొంటుంది. పుట్టినరోజున రక్తదానం, అన్నదానం, పండ్లు పంపిణీ.. ఇలా పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. హీరోలు కూడా అభిమానుల్ని ఖుషీ చేసేందుకు తాము నటిస్తున్న తాజా చిత్రాల నుంచి ఫస్ట్‌ లుక్, మోషన్‌ పోస్టర్, టీజర్, ట్రైలర్‌.. ఇలా ఏదో ఒకటి విడుదలయ్యేలా ప్లాన్‌ చేస్తుంటారు. ఈ నెల 23న హీరో ప్రభాస్‌ పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు కానుకగా ఎలాంటి అప్‌డేట్స్‌ వస్తాయా? అని ఎదురు చూస్తున్నారు అభిమానులు.

రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాధే శ్యామ్‌’. ఆయన బర్త్‌ డే గిఫ్ట్‌గా ‘బీట్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌’ పేరుతో ‘రాధేశ్యామ్‌’ మోష¯Œ  పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘వాళ్లు (హీరోహీరోయిన్‌ ప్రభాస్, పూజా హెగ్డే) మిమ్మల్ని మరోసారి కచ్చితంగా లవ్‌లో పడేస్తారు. అక్టోబర్‌ 23న మోష¯Œ  పోస్టర్‌ను విడుదల చేస్తున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మరిన్ని వార్తలు