ప్రభాస్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. 'రాధేశ్యామ్' అప్‌డేట్ వ‌చ్చిందోచ్‌

13 Nov, 2021 13:00 IST|Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌. ఎట్టకేలకు ‘రాధేశ్యామ్‌’(Radhe Shyam)నుంచి అప్‌డేట్‌ వచ్చింది. సాహో తర్వాత ప్రభాస్‌ నటించిన మరో పాన్‌ ఇండియా చిత్రమే ‘రాధేశ్యామ్‌’.పూజ హెగ్డే హీరోహీరోయిన్‌. కె. రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించిన ఈచిత్రాన్ని వంశీ, ప్రమోద్‌, ప్రసీధలు సంయుక్తంగా నిర్మించారు. ఇటలీ నేపథ్యంగా సాగే పీరియాడికల్‌ ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో ప్రభాస్‌ విక్రమాదిత్య పాత్ర పోషిస్తుండగా, పూజ హెగ్డే ప్రేరణగా నటిస్తోంది.

ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకొని చాలా రోజులు అయినప్పటికీ.. ఇప్పటి వరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశలో ఉన్నారు. సినిమా విడుదల చేయకపోయినా సరే.. కనీసం ఒక్క అప్‌డేట్‌ అయినా ఇవ్వడంటూ.. సోషల్‌ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ అభిమాని ఏకంగా సూసైడ్‌ నోట్‌ కూడా రాశాడు. దీంతో రాధేశ్యామ్‌ చిత్రయూనిట్‌ ఒక మెట్టు దిగొచ్చి.. తాజాగా ఓ అప్‌డేట్‌ ఇచ్చింది. రాధేశ్యామ్ సినిమా నుంచి “ఈ రాతలే.. ” అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ వీడియోను ఈనెల 15న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ని సోషల్‌ మీడియాలో విడుదల చేసింది. 

A post shared by UV Creations (@uvcreationsofficial)

మరిన్ని వార్తలు