ఇటలీలో ఇస్టార్ట్‌ 

1 Oct, 2020 05:00 IST|Sakshi

కోవిడ్‌ గ్యాప్‌ తర్వాత ప్రభాస్‌ మళ్లీ పనిలో పడ్డారు. ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్‌’ చిత్రం షూటింగ్‌ ఇవాళ ఇటలీలో తిరిగి ప్రారంభం కానుందని తెలిసింది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడిక్‌ ప్రేమకథ ఇది. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ ఇటలీలో నేడు ప్రారంభం కానుంది. చిత్ర బృందం మొత్తం ఇటీవలే ఇటలీ ప్రయాణం అయింది. ఈ షెడ్యూల్‌ సుమారు 20 రోజులపాటు సాగనుందని సమాచారం. ఈ చిత్రంలో కృష్ణంరాజు, భాగ్యశ్రీ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో చిత్రీకరణ పూర్తి చేయనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా