ఐసోలేషన్‌లోకి ప్రభాస్‌.. రాధేశ్యామ్‌ షూటింగ్‌కు బ్రేక్‌!

21 Apr, 2021 16:16 IST|Sakshi

భారత్‌లో కరోనా మహమ్మారి రెండో దశ విజృంభణ తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతిరోజూ లక్షలాది పాజిటివ్‌ కేసులు  నమోదవుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా సినీ, రాజకీయరంగంపై కరోనా ప్రభావం అధికంగా ఉంది. టాలీవుడ్‌లో ఒక్కొక్కరిగా కరోనా బారినపడటంతో మిగతావారందరూ ఆందోళన చెందుతున్నారు. అలాగే ఇటీవల కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో సినిమా షూటింగ్‌లన్నీ వాయిదా పడుతున్నాయి.

చదవండి: ‘రాధేశ్యామ్‌’లో పూజా హేగ్డే పాత్ర ఇదేనా

తాజాగా యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ సోలేషన్‌లోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్‌ హోమ్‌ క్వారంటైన్‌‌లో ఉన్నాడు. వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్‌కు కరోనా సోకింది. దీంతో ముందు జాగ్రత్తగా ప్రభాస్‌కు కూడా ఐసోలేషన్‌లోకి వెళ్లాడు. కాగా ప్రభాస్‌ చేతినండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న రాధేశ్యామ్‌ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకోంటుంది. చివరి షెడ్యూల్‌ మాత్రమే మిగిలుంది. ఇందులో భాగంగా ఓ పాటతోపాటు కొన్ని సీన్లు మాత్రమే షూట్‌ చేయాల్సి ఉంది.

చదవండి: ‘ఆదిపురుష్‌’పై రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

వీటి అనంతరం, ఆదిపురుష్‌, సలార్‌ వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్నాయి. అయితే తాజాగా ప్రభాస్‌ క్వారంటైన్‌లోకి వెళ్లడంతో షూటింగ్‌కు కాస్తా బ్రేక్‌ పడింది. అంతేగాక ప్రభాస్‌తోపాటు మొత్తం రాధేశ్యామ్‌ చిత్రయూనిట్‌ అంతా కూడా సెల్ప్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు