ఈ ఏడాది టాలీవుడ్‌లో అతిపెద్ద డిజాస్టర్ మూవీ అదేనా..!

21 Dec, 2022 20:58 IST|Sakshi

కాలగమనంలో మరో ఏడాది కనుమరుగవుతోంది. మరి కొన్ని రోజుల్లోనే 2022వ ముగియనుంది. కొత్త ఆశలతో 2023కి స్వాగతం పలికేందుకు యావత్ ప్రపంచం రెడీ అవుతోంది. మరి ఈ ఏడాదిలో ఏం సాధించారో ఓ సారి నెమరు వేసుకోవాల్సిన సమయం ఇది. ఇక టాలీవుడ్ చిత్రాల విషయానికొస్తే ప్రతి ఏడాదిలాగే సక్సెస్, ఫెయిల్యూర్ తప్పనిసరిగా ఉంటాయి.  

ఈ ఏడాది కూడా టాలీవుడ్‌లో చాలా సినిమాలు వచ్చాయి. కొన్ని చిత్రాలు బాక్సాఫీస్‌ను బద్దలు కొడితే మరికొన్ని చతికిలపడ్డాయి. కానీ ఎక్కువ శాతం సినిమాలు అభిమానులను నిరాశకు గురి చేశాయి. కొన్ని చిత్రాలు మాత్రం ఫర్వాలేదనిపించాయి. రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్ పలు రికార్డులను తిరగ రాసిన సంగతి తెలిసిందే. మరోవైపు చిన్న చిత్రాలు బింబిసార, కార్తికేయ ఊహించని స్థాయిలో కలెక్షన్లు రాబట్టాయి. 

అయితే టాలీవుడ్ చిత్రాల్లో డిజాస్టర్‌గా నిలిచిన చిత్రం ప్రభాస్, పూజా హేగ్డే నటించిన రాధేశ్యామ్‌. ఈ సినిమా ఏకంగా రూ.500 నుంచి రూ.1000 కోట్ల కలెక్షన్స్ రాబడుతుందని అంచనా వేశారు. కానీ వంద కోట్ల కలెక్షన్స్ కూడా రాబట్టలేక చతికిల పడిపోయింది. ప్రభాస్ ఆల్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న హీరో కావడంతో భారీ కలెక్షన్స్ నమోదు చేసే అవకాశం ఉందని భావించారు. ముఖ్యంగా ఉత్తర భారతంలో కనీసం కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. దీంతో ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్‌ మూవీగా రాధేశ్యామ్‌ నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని వార్తలు