Radikaa Sarathkumar: రాధిక, ఊర్వశి నవరాత్రి పాట.. సిగ్గు పడిన రష్మిక

8 Oct, 2021 10:25 IST|Sakshi

టాలీవుడ్‌ యంగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో సీనియర్ నటీమణులు రాధిక శరత్ కుమార్, ఊర్వశి, ఖుష్బూ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది.

తాజాగా నవరాత్రి సంద​ర్భంగా ఈ మూవీ షూటింగ్ స్పాట్‌లో రాధిక, ఊర్వశితో కలిసి రష్మికతో చేసిన వీడియో వైరల్‌గా మారింది. అందులో.. శివాజీ గణేశన్, ‘మహానటి’ సావిత్రి కలిసి నటించిన తమిళ సూపర్ హిట్ మూవీ ‘నవరాత్రి’ లోని పాపులర్‌ సాంగ్‌ ‘నవరాతిరి.. శుభరాతిరి’ని సీనియర్‌ నటీమణులు పాడారు. ఆ సమయంలో మధ్యలో ఉన్న రష్మిక సిగ్గు పడుతూ ఉన్న ఆ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఎస్‌ఎల్‌వీ  సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

చదవండి: శర్వానంద్ చిత్రంలో ముగ్గురు సీనియర్ హీరోయిన్స్

మరిన్ని వార్తలు