వర్మ సినిమాకు ఎందుకు సైన్ చేశానా అనిపించింది..

21 May, 2021 20:26 IST|Sakshi

ఆర్జీవీపై నటి రాధికా ఆప్టే బోల్డ్‌ కామెంట్స్‌

నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచే నటి రాధికా ఆప్టే డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మపై సంచలన వ్యాఖ్యలు చేసింది. రక్తచరిత్ర సినిమా సమయంలో తన సమయాన్ని బాగా వాడుకున్నారని, తన పనికి తగ్గ రెమ్యూనరేషన్‌ కూడా ఇవ్వలేదని చెప్పింది. ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన రక్తచరిత్ర సినిమాలో రాధికా ఆప్టే నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె డీ గ్లామరస్‌ రోల్‌లో కనిపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె రక్తచరిత్ర షూటింగ్‌ సమయంలో తాను ఎక్స్‌ప్లాయిటేషన్‌కి గురయ్యాననే ఫీలింగ్ కలిగిందని తెలిపింది. 'నేను మూవీ ఒప్పుకునేటప్పుడు కేవలం తెలుగు వెర్షన్‌ అని చెప్పారు. అందుకు తగ్గట్లు రెమ్యూనరేషన్‌ ఇచ్చారు.

తీరా సెట్స్‌లోకి వెళ్లాకా సినిమాను తెలుగు, తమిళంలో షూట్ చేశారు. అంటే రెండు సినిమాలకు పనిచేసినట్టే. ఇందుకు తగ్గట్లు గానే నాకు రెమ్యూనరేషన్‌ ఇవ్వాలి కానీ అలా జరగలేదు. ఇక ఈ సినిమాలో పెద్ద స్టార్స్‌ నటించడంతో షూటింగ్‌ కూడా ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు పూర్తవుతుందో తెలిసేది కాదు. ఈ మూవీ కోసం నేను చాలా  సమయాన్ని కేటాయించాను. అయితే నా  టాలెంట్‌కి, నా సమయానికి విలువ లేదనిపించింది.

నిజానికి వర్మ రూపొందించిన రంగీలా, సత్య చిత్రాలంటే నాకు  చాలా ఇష్టం. ఆ సినిమాలతో వర్మకు ఫ్యాన్‌ అయ్యా. అందుకే ఆయనతో పనిచేస్తే కొత్త విషయాలు నేర్చుకోవచ్చని భావించాను. కానీ ఆ తర్వాత మాత్రం రక్త చరిత్ర సినిమాకు ఎందుకు సైన్ చేశానా అనిపించింది' అంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. ప్రస్తుతం ఆర్జీవీపై రాధికా ఆప్టే చేసిన ఈ కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. 

చదవండి : అలా ఆమిర్‌ ఖాన్‌తో మనస్పర్థలు వచ్చాయి: ఆర్జీవీ
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న అరియానా గ్రాండె

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు