న్యూడ్‌ వీడియో లీక్‌.. 4 రోజులు బయటకు రాలేదు: నటి

21 May, 2021 20:28 IST|Sakshi

పార్చ్‌డ్‌ న్యూడ్‌ వీడియో లీక్‌పై మరోసారి స్పందించిన రాధిక ఆప్టే

కుంబ బద్దలు కొట్టినట్లు మాట్లాడే వారిలో ముందు వరుసలో ఉంటారు నది రాధికా ఆప్టే. ఇక ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్‌ డిమాండ్‌ చేస్తే ఏం చేయడానికైనా వెనకాడరు. విభిన్న పాత్రలు సెలక్ట్‌ చేసుకుంటూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాదిక ఆప్టే. అయితే ఈ బోల్డ్‌నెస్‌ వల్ల కొన్ని సార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు రాధిక ఆప్టే. గతంలో ఆమెకు సంబంధించిన ఓ న్యూడ్ క్లిప్లింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ సమయంలోనే ఈ వీడియోపై రియాక్ట్ అయిన రాధిక.. మరోసారి ఈ ఇష్యూపై స్పందిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. 

సెక్స్ వర్కర్‌గా రాధిక ఆప్టే నటించిన 'పార్చ్‌డ్' చిత్రం అప్పట్లో వివాదాస్పదమైంది. ఆ సమయంలోనే ఆమెకు సంబంధించి ఓ న్యూడ్ వీడియో క్లిప్పింగ్ వైరల్ కావడంతో షాకైన రాధికా ఆప్టే.. తన ఫేస్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో తనది కాదని 2016లోనే క్లారిటీ ఇచ్చారు.. అయితే తాజాగా మరోసారి అదే అంశంపై మాట్లాడి వార్తల్లో నిలిచారు రాధిక ఆప్టే.

ఆ న్యూడ్ వీడియో బయటికి వచ్చిన సమయంలో ఎంతోమంది ఎన్నోరకాలుగా మాట్లాడారని, ట్రోల్‌ చేశారని చెబుతూ రాధిక ఆవేదన చెందారు. ఊహించని విధంగా తలెత్తుకోలేని పరిస్థితి ఎదురుకావడంతో నాలుగు రోజులు నేను బయట అడుగుపెట్టలేకపోయాను. ఎంతో మానసిక వేదన అనుభవించాను. అయితే పార్చడ్‌ చిత్రంలో నటించినందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు’’ రాధిక.

2015లో ఈ చిత్రాన్ని దర్శకుడు లీనా యాదవ్ తెరకెక్కించగా.. అజయ్ దేవ్‌గన్ నిర్మించారు. ఇది రాజస్తాన్‌లోని ఒక గ్రామంలో నివసిస్తున్న ముగ్గురు మహిళల సాధికారిత కథ. ఇక రాధిక తెలుగులో బాలకృష్ణతో ''లయన్‌, లెజెండ్‌'' సినిమాల్లో నటించిన రాధిక ఆప్టే.. హిందీలో ''ప్యాడ్‌మ్యాన్, అంధాదూన్, బద్లాపూర్, గౌల్, సేక్రెడ్ గేమ్స్'' లాంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. 

చదవండి: వీసా కోసమే పెళ్లి చేసుకున్నా: రాధికా ఆప్టే

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు