పాత రోజులు గుర్తొచ్చాయి!

9 Apr, 2021 01:31 IST|Sakshi

షూటింగ్‌ కోసం రకరకాల ప్రదేశాలకు వెళ్లినప్పుడు బ్రేక్‌ దొరికితే చాలు.. ఆ ప్రదేశాలను చుట్టొస్తారు తారలు. ‘మిసెస్‌ అండర్‌కవర్‌’ షూటింగ్‌ కోసం కోల్‌కతా వెళుతున్నప్పుడు బ్రేక్‌ దొరికితే కోల్‌కతాను రౌండప్‌ చేద్దామనుకున్నారు రాధికా ఆప్టే. కానీ అందరి ప్లానులూ తారుమారు చేయడానికే కరోనా ఉంది కదా! కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందున ‘మిసెస్‌ అండర్‌కవర్‌’ యూనిట్‌ తాము బస చేస్తున్న హోటల్‌కి, షూటింగ్‌ లొకేషన్‌కి తప్ప ఎక్కడికీ వెళ్లకూడదని ముందుగానే నిర్ణయించుకున్నారట.

దాంతో కోల్‌కతాలో 35 రోజులు వరుసగా షూటింగ్‌ చేసినా లొకేషన్‌కి, హోటల్‌ రూమ్‌కి తప్ప రాధికా ఎక్కడికీ వెళ్లలేకపోయారు. ఓ పదేళ్ల తర్వాత కోల్‌కతాలో ఆమె ఎక్కువ రోజులు షూటింగ్‌లో పాల్గొన్న సినిమా ఇదేనట! గతంలో ‘అంతహీన్‌’  (2009) అనే బెంగాలీ సినిమా షూటింగ్‌ని అక్కడ చేశారు. ఇప్పుడు ఈ హిందీ సినిమా చిత్రీకరణలో పాల్గొంటుంటే, పాత రోజులన్నీ ఈ బ్యూటీకి గుర్తొచ్చాయట. ఇక ‘మిసెస్‌ అండర్‌ కవర్‌’ విషయానికొస్తే.. ఇందులో గృహిణి నుంచి అండర్‌ కవర్‌ ఏజెంట్‌గా మారే పాత్రను చేస్తున్నారు రాధికా ఆప్టే. ఇటీవల విడుదలైన ఆమె ఫస్ట్‌ లుక్‌ ఆసక్తికరంగా ఉంది. ఈ స్పై ఎంటర్‌టైనర్‌కి నూతన దర్శకురాలు అనుశ్రీ మెహతా దర్శకత్వం వహిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు