నా ఆరోగ్యం బాగుంది!

10 Apr, 2021 06:27 IST|Sakshi

సినీ సెలబ్రిటీల ఆరోగ్యంపై ఆన్‌లైన్‌లో పలు రకాల వార్తలు హల్‌చల్‌ చేస్తుంటాయి. ఒక్కోసారి ఏది నిజమో? ఏది అబద్ధమో? తెలియక వారి అభిమానులు కంగారు పడుతుంటారు. ఆ వార్తలు అటూ ఇటూ  తిరిగి సంబంధిత సెలబ్రిటీ వద్దకు చేరాక ‘నేను ఆరోగ్యంగానే ఉన్నాను.. వదంతులు నమ్మొద్దు’ అంటూ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. తాజాగా నటి రాధికకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ‘రాధిక ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై తాజాగా ట్విట్టర్‌ వేదికగా రాధిక స్పందిస్తూ– ‘‘మీరు (అభిమానులు) నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. నా ఆరోగ్యంపై ఎన్నో పుకార్లు వస్తున్నాయి. వాటిని నమ్మొద్దు. నాకు కరోనా సోకలేదు. కరోనా వ్యాక్సిన్‌ రెండో డోస్‌ తీసుకున్న తర్వాత స్వల్పంగా ఒళ్లు నొప్పులు వచ్చాయి. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను. ఆఫీసుకు హాజరవుతున్నా’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు