కరోనా వ్యాక్సిన్ వేసుకున్న సీనియర్ నటి

4 Mar, 2021 14:15 IST|Sakshi

‘మెడ్రాస్‌ ఎన్నా... మెల్‌బోర్న్‌ ఎన్నా’... అనే పాటలో ఇటీవల యాక్ట్‌ చేసి వచ్చారు రాధిక ‘ఓ అంధ నాట్కల్‌’ అనే తాజా తమిళ సినిమా కోసం. ఇప్పుడు ‘కోవిడ్‌ ఎన్నా’ అంటారేమో. ఎందుకంటే మలి విడత వాక్సినేషన్‌ లో దక్షిణాది సినిమా రంగం నుంచి దాదాపుగా రాధికనే మొదటి డోస్‌ను వేసుకున్నారని చెప్పవచ్చు. కమలహాసన్, చారుహాసన్‌ తదితరులు తరువాతి వరుస లో ఉన్నారు. నర్సులు తనకు వేక్సిన్‌ వేస్తున్న ఫోటోను ట్విట్టర్‌లో పెట్టి ‘వేక్సిన్‌ వేసుకున్నాను. దయచేసి మిమ్మల్ని, మీ ఆత్మీయుల్ని వేక్సిన్‌ ద్వారా రక్షించుకోండి’ అని కామెంట్‌ పెట్టారు. చిరంజీవి, రజనీకాంత్, కృష్ణ, కృష్ణంరాజు, చంద్రమోహన్‌ వంటి స్టార్లందరితో రాధిక కలిసి నటించారు.

అయితే వేక్సిన్‌ విషయంలో అందరికంటే ముందు ఉన్నారు. రాధిక ఏనాడూ నటన నుంచి విరామం తీసుకోలేదు. పెద్ద తెర మీదా లేదా చిన్నతెర మీద నటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఒకనాటి హీరోయిన్లు సుహాసిని, ఊర్వశి, ఖుష్బూలతో కామెడీ సినిమాగా ‘ఓ అంధ నాట్కల్‌’లో నటిస్తున్నారు. ఇది తెలుగులో తప్పక అనువాదం అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాధిక తెలుగు తెర మీద ఇటీవ కనిపించిన సినిమా ‘రాజా ది గ్రేట్‌’ అని పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ఆమె భర్త శరత్‌ కుమార్‌ కూడా తెలుగులో తరచూ నటిస్తున్నారు. 

చదవండి: గుర్తుండిపోయే సినిమాలు ఇచ్చారు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు