Chandramukhi 2: వచ్చేస్తోంది 'చంద్రముఖి 2'.. సీక్వెల్‌పై అధికారిక ప్రకటన

14 Jun, 2022 19:36 IST|Sakshi

Raghava Lawrence Chandramukhi 2 Lyca Productions Official Announcement: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, జ్యోతిక, నయన తార కలిసి నటించి బ్లాక్‌ బస్టర్ హిట్‌ సాధించిన చిత్రం 'చంద్రముఖి'. 2005లో వచ్చిన ఈ మూవీకి పి. వాసు దర్శకత్వం వహించారు. కామెడీ, హార్రర్‌ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌ వస్తే ఎంతో బాగుంటుందని సగటు ప్రేక్షకుడు కోరుకున్నాడు. అందుకు తగినట్లుగానే ఈ ఆల్‌టైమ్‌ సూపర్‌ హిట్‌ మూవీకి సీక్వెల్‌ వస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే హీరో, హీరోయిన్లు ఎవరు అనే అంశంపై స్పష్టత రాలేదు. కానీ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్‌ వార్త ఇండస్ట్రీలో హల్‌చల్‌ చేస్తోంది. 

'చంద్రముఖి' సినిమా విడుదలై సుమారు 17 ఏళ్లు అవుతుంది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ రానున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ 'లైకా ప్రొడక్షన్స్‌' అధికారికంగా తెలిపింది. అయితే ఈ సినిమాలో రాఘవ లారెన్స్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. 'కాంచన' మూవీ సిరీస్‌లతో హారర్‌, కామెడీ అందించడంలో దిట్టగా లారెన్స్‌ నిరూపించుకున్నాడు. అందుకే ఇప్పుడు ఈ 'చంద్రముఖి 2'లో మేయిన్‌ రోల్‌లో లారెన్స్‌ నటించనున్నాడు. మొదటి సినిమాను డైరెక్ట్‌ చేసిన పి. వాసు ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. చంద్రముఖిలో తనదైన కామెడీని పండించిన వడివేలు ఈ సీక్వెల్‌లో అలరించనున్నాడు. అలాగే ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించునున్నారు. ఆర్‌డీ రాజశేఖర్‌ కెమెరామేన్‌గా బాధ్యలు చెపట్టగా, తోట తరణి ఆర్ట్‌ వర్క్‌ను చూసుకోనున్నారు. 
 


అయితే 'చంద్రముఖి' సినిమాను శివాజీ ప్రొడక్షన్స్‌ నిర్మించగా 'చంద్రముఖి 2'ను నిర్మించే బాధ్యతను మాత్రం 'లైకా ప్రొడక్షన్స్‌' తీసుకుంది. అయితే ఈ మార్పుకు గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుండగా, ఇది బహుభాషా చిత్రంగా ఉంటుందా ? లేదా తమిళంలో మాత్రమే విడుదల చేస్తారా అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఎదురుచూడాల్సిందే. ఇదిలా ఉంటే చంద్రముఖి తర్వాత వెంకటేశ్‌, పి. వాసు కాంబినేషన్‌లో 'నాగవల్లి' సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. అప్పట్లో చంద్రముఖి సినిమాకు ఇదే సీక్వెల్‌గా ప్రచారం జరిగింది. కాకపోతే ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. దీంతో ఇప్పుడు పక్కా స్క్రిప్ట్‌తో చంద్రముఖి 2ను రూపొందించనున్నారా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. 
 

మరిన్ని వార్తలు