జై భీమ్‌: రాసాకన్ను సతీమణికి ఇల్లు కట్టిస్తా: రాఘవ లారెన్స్‌

9 Nov, 2021 09:32 IST|Sakshi

తమిళ సినిమా : రాసాకన్ను సతీమణి పార్వతికి ఇల్లు కట్టిస్తానని నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్‌ తెలిపారు. కొండ ప్రాంతానికి చెందిన ఈ దంపతుల యదార్థ ఘటనల ఆధారంగా చేసుకుని నిర్మించిన చిత్రం జై భీమ్‌. ఇటీవల ఓటీటీలో విడుదలై ప్రశంసలు అందుకుంటోంది. రాసాకన్ను భార్య పార్వతి ఉండడానికి సరైన ఇల్లు కూడా లేక కడు పేదరికాన్ని అనుభవిస్తోంది. చేయని నేరానికి రాసాకన్ను హత్యకు గురికావడం.. ఆయన సతీమణి పార్వతి దీన పరిస్థితి గురించి సామాజిక మాధ్యమాల్లో తెలుసుకున్న రాఘవ లారెన్స్‌ చలించిపోయారు.

ఆమెకు తన సొంత డబ్బుతో ఇల్లు కట్టిస్తానని సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 28 ఏళ్ల క్రితం జరిగిన ఘోరమైన సంఘటనలను ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చించుకునేలా చేసిన జై భీమ్‌ చిత్ర యూనిట్‌కు, ఆ చిత్రాన్ని సంచలనంగా మార్చిన నటుడు సూర్య, జ్యోతిక, దర్శకుడు టీజే.జ్ఞానవేల్‌కు హృదయపూర్వక అభినందనలు అని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు