‘చంద్రముఖి- 2’ కోసం లారెన్స్‌ భారీ రెమ్యునరేషన్‌.. ఎన్ని కోట్లంటే..

1 Oct, 2023 14:53 IST|Sakshi

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే స్ట్రాటజీని పక్కాగా ఫాలో అవుతున్నాడు రాఘవ లారెన్స్‌. పలువురు దర్శక నిర్మాతలు అతన్ని హీరోగా పెట్టి సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తుండడంతో తన సొంత సినిమాలను పక్కన పెట్టేశాడు. ముందుగా బయట సినిమాలు తీసి.. అవకాశాలు రానప్పుడు సొంత కథలను తెరకెక్కించాలని ప్లాన్‌ చేసుకుంటున్నాడు. అందుకే ఫలితాలలో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు.

(చదవండి: ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు.. నయనతార ఆస్తుల విలువెంతో తెలుసా?)

తాజాగా ఈ టాలెంటెడ్‌ హీరో నటించిన చంద్రముఖి 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  అప్పట్లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'చంద్రముఖి'కి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. పి. వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. సెప్టెంబర్ 28న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. దీంతో ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టకలేకపోయింది.  అయితే విడుదలకు ముందే మంచి బిజినెస్‌ చేయడంతో నిర్మాతలకు పెద్దగా నష్టమేమి జరగలేదు. 

ఇవన్నీ పక్కకు పెడితే.. హీరో లారెన్స్‌కు మాత్రం చంద్రముఖి 2 చాలా స్పెషల్‌ అనే చెప్పాలి. గత సినిమాలతో పోలిస్తే చంద్రముఖి 2కి  చాలా ఎక్కువ రెమ్యునరేషన్‌ ఇచ్చారట. ఈ చిత్రం కోసం లారెన్స్‌కి లైకా నిర్మాణ సంస్థ దాదాపు రూ. 25 కోట్లను పారితోషికంగా  ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓ సినిమాకు ఇంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్‌ తీసుకోవడం లారెన్స్‌కి ఇదే తొలిశారట. ప్రస్తుతం ఈ న్యూస్‌ కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. సినిమా హిట్‌ కాకపోయినా.. లారెన్స్‌కి మాత్రం మంచి లాభమే తెచ్చిపెటి​ందని పలువురు కామెంట్స్‌ చేస్తున్నారు.
(చదవండి: పేద వృద్ధురాలు పట్ల సితార తీరు.. నెటిజన్స్‌ ఫిదా!)

మరిన్ని వార్తలు