MAA Elections 2021: ‘మా’ ఎన్నికలు ఏకగ్రీవం అయితే బాగుండేది: రాఘవేంద్రరావు

12 Oct, 2021 11:16 IST|Sakshi

దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఎట్టకేలకు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలపై స్పందించారు. ఈ సారి మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలిపిస్తూ రాజకీయ రణరంగాన్ని తలపించాయన్నారు. ఆయన దర్శక పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్లి సందD మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా సోమవారం(అక్టోబర్‌ 11) విశాఖపట్నం వెళ్లారు.  

చదవండి: తన రాజీనామా లేఖలో నాగబాబు సంచలన వ్యాఖ్యలు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికల్లో ఇంత గందరగోళం జరగకుండా ఉండాల్సింది అన్నారు. ‘ఎన్నికల్లో ఇంత అలజడి సృష్టించడం చిత్ర పరిశ్రమకు మంచిది కాదు. సినీ పెద్దలు అంతా కలిసి మా అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని ఎన్నుకుని.. ఎన్నికలను ఏకగ్రీవం చేసి ఉంటే బాగుండేది. నిజానికి అదే మంచి పద్దతి. ఇక అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు రాణిస్తాడనే నమ్మకం ఉంది’ అని ఆయన అన్నారు. 

చదవండి: నన్ను ఎవరు గుర్తు పట్టడంలేదు, అందుకే ఈవెంట్స్‌కి రావట్లేదు: రవళి

మరిన్ని వార్తలు