ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో రాగిణి ద్వివేది లైవ్‌

12 Feb, 2021 14:20 IST|Sakshi

ఇకపై అభిమానులను అలరిస్తానని ప్రకటన

తనకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు

తన జీవితంలో కొన్ని సంఘటనలు తనను బాధ పెట్టాయని, తనపై జరిగిన దుష్ప్రచారంపై మాట్లాడుతూ లైవ్‌లోనే హీరోయిన్‌ ఏడ్చేసింది. జరిగిన దాని గురించి బాధపడకుండా కోలుకుని చివరకు మిమ్మల్ని అలరిస్తానని ప్రకటించింది. ఆమెనే కన్నడ హీరోయిన్‌ రాగిణి ద్వివేది. ఆమె డ్రగ్స్‌ కేసులో అరెస్టయి 145 రోజుల పాటు జైలు శిక్ష అనుభ‌వించి ఇటీవల బెయిల్‌పై విడుద‌లై ఇంటికొచ్చింది.

ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె లైవ్‌లోకి వచ్చింది. ఈ సందర్భంగా తన అభిమానుల‌తో మాట్లాడింది. ఈ క్రమంలో ఆవేదన చెందుతూ కన్నీళ్లు పెట్టుకుంది. క్లిష్ట సమయంలో తనకు, తన కుటుంబానికి అండ‌గా నిలిచిన వారికి ఈ సందర్భంగా రాగిణి కృత‌జ్ఞ‌తలు తెలిపింది. త‌న‌పై జ‌రిగిన  దుష్ప్ర‌చారంపై ఆవేదన వ్యక్తం చేసింది. 19.43 నిమిషాల పాటు ఆమె మాట్లాడింది. ఈ సందర్భంగా త‌న‌పై, త‌న కుటుంబంపై వచ్చిన ప్రచారం.. వివాదాస్పద వ్యాఖ్య‌లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి వ్యాఖ్యలు చేసిన ఆ కామెంట్స్ ఒక‌సారి మీరే చ‌దువుకోండి అని సూచించింది.

‘మీ కుటుంబస‌భ్యుల‌పై ఎవ‌రైనా ఇలాంటి కామెంట్స్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అని రాగిణి హితవు పలికింది. దాని గురించి పెద్దగా ఆలోచించ‌క‌పోయినా ఆ బాధ తనను వెంటాడుతూనే ఉందని కన్నీటి పర్యంతమైంది. కాలం ప్ర‌తి గాయాన్ని న‌యం చేస్తుందని తనకు తాను ధైర్యం చెప్పుకుంది.  అయితే కొన్నాళ్లకు అన్ని విష‌యాల గురించి మాట్లాడుతానని చెప్పింది. ప్ర‌స్తుతం తాను క్లిష్ట ద‌శ‌లో ఉన్నానని చెప్పింది. ‘ఇక మిమ్మల్ని నవ్విస్తాను.. ఫీల్‌ గుడ్‌ చేస్తానని.. వంట, ఫన్నీ వీడియోలతో మీ ముందుంటా’ అని రాగిణి తెలిపింది. మోడల్‌గా ఉన్న రాగిణి ద్వివేది సినిమాల్లోకి వచ్చారు. కన్నడలో వీర మడకరి, కెంపెగౌడ, శివ, బంగారి, రాగిణి ఐపీఎస్‌ సినిమాలతో గుర్తింపు పొందింది.
 

A post shared by Ragini dwivedi (@rraginidwivedi)

మరిన్ని వార్తలు