ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను

15 Mar, 2021 09:50 IST|Sakshi

‘‘డిజిటల్‌ డెమోక్రసీ పెరగడం వల్ల అన్ని సినిమాలను ప్రేక్షకులు చూస్తున్నారు. విభిన్నమైన సినిమాల పట్ల ప్రేక్షకులకు అవగాహన పెరిగింది. దీంతో కొత్త రకమైన సినిమాలకు ఆదరణ పెరిగింది’’ అని రాహుల్‌ రామకృష్ణ అన్నారు. నవీన్‌ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా జంటగా, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో కేవీ అనుదీప్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘జాతిరత్నాలు’. స్వప్నా సినిమాస్‌ పతాకంపై నాగ్‌ అశ్విన్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదలైంది.

రాహల్‌ రామకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఈ కథ వింటున్నప్పుడే చాలా ఎంజాయ్‌ చేశాను. మొదట్లో ఈ సినిమాకు ఆడియన్స్‌ కనెక్ట్‌ అవుతారా? అనిపించింది. రిలీజ్‌ తర్వాత మా డౌట్స్‌ అన్నీ పోయాయి. అనుదీప్‌లో మంచి సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉంది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘జర్నలిస్ట్‌గా నా కెరీర్‌ను స్టార్ట్‌ చేశాను. క్రైమ్‌ బీట్‌ చూశాను. ఆ తర్వాత ఫిల్మ్‌ రిపోర్టర్‌ అవుదామనుకొని ఇప్పుడు ఫిల్మ్స్‌లో యాక్టర్‌గా చేస్తున్నాను. ‘అర్జున్‌రెడ్డి’లో శివ పాత్ర నాకు మంచి గుర్తింపు తెచ్చింది. మా అమ్మగారు నా నటనకు పెద్ద క్రిటిక్‌. ‘నువ్వు బాగా నటించావు’ అని మా అమ్మగారు చెప్పే రోజు కోసం వెయిట్‌ చేస్తున్నాను. రీసెంట్‌గా ‘వై’ అనే సినిమాలో ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ చేశాను. హీరోగానో, విలన్‌గానో ఎందుకు చేయకూడదని నాకు అనిపించింది. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నాను. ఇందులో నేను లీడ్‌ యాక్టర్‌గా చేస్తున్నవి కూడా ఉన్నాయి’’ అన్నారు. 

చదవండి: సోషల్‌ హల్‌చల్‌: అందాల భామలు, లేతమెరుపు తీగలు..

మరిన్ని వార్తలు