మరోసారి హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్న డైరెక్టర్

27 Mar, 2021 08:41 IST|Sakshi

రెండేళ్ల గ్యాప్‌ తర్వాత ఓ తమిళ సినిమాకు గ్రీన్‌  సిగ్నల్‌ ఇచ్చారు దర్శక–నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ . మలయాళంలో ప్రేక్షకుల ప్రసంశలు అందుకున్న ‘ది గ్రేట్‌ ఇండియన్‌  కిచెన్‌ ’ సినిమా తమిళ రీమేక్‌లో రాహుల్‌ హీరోగా నటించనున్నారు. ఇందులో ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్‌ . కన్నడ  దర్శకుడు. ‘‘ది గ్రేట్‌ ఇండియన్‌  కిచెన్‌’ సినిమాను చూశాను. సూపర్‌గా ఉంది. ఇదొక యూనివర్సల్‌ సబ్జెక్ట్‌. అన్ని భాషల్లోనూ ఈ సినిమాను తీయాలి. మణిరత్నంగారి దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేస్తున్నప్పటి నుంచే నా భార్య (గాయని, అనువాద కళాకారిణి చిన్మయి)కి కన్నడ  తెలుసు.

2012లో వచ్చిన నా తమిళ సినిమా ‘విన్‌ మీన్‌ గళ్‌’ స్క్రీనింగ్‌ టైమ్‌లో కన్నన్‌ గారిని నేను కలిశాను. అప్పుడు నాతో ఓ సినిమా చేయాలని ఉందని చెప్పారు. ఇప్పుడు ఆయన ఈ సినిమాతో వచ్చి నన్ను సంప్రదించినప్పుడు సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. ఐశ్వర్యా రాజేష్‌లాంటి అద్భుతమైన నటితో నటించడం ఓ చాలెంజ్‌’’ అని పేర్కొన్నారు రాహుల్‌ రవీంద్రన్‌ . కొత్తగా పెళ్లయిన దంపతుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. అత్తింటికి తగ్గట్టు ఒదిగిపోవడానికి ఓ అమ్మాయి ఎలాంటి కష్టాలు పడుతుందనేది ప్రధానాంశం. మలయాళంలో ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.

మరిన్ని వార్తలు