తొక్కేశారు, రాహుల్‌ కాలికి రక్తస్రావం

22 Feb, 2021 19:27 IST|Sakshi

బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ విన్నర్‌, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ బట్టల వ్యాపారంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అందరి నోళ్లలో నానేలా తన స్టోర్‌కు ఊకోకాకా అని నామకరణం చేశాడు. హైదరాబాద్‌, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్లలో ఇప్పటికే ఈ స్టోర్లను లాంఛనంగా ప్రారంభించగా ఆదివారం సాయంత్రం వరంగల్‌లోని హన్మకొండలో కొత్త బ్రాంచ్‌ ఓపెన్‌ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు రాహుల్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో వారిని ఆపడం అక్కడున్నవాళ్లకు కష్టతరంగా మారింది.

ఈ క్రమంలో రాహుల్‌ తనను ముందుకెళ్లనివ్వకుండా పైపైకి వస్తున్నవారి మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో పలువురు నెటిజన్లు రాహుల్‌ చిచా ఇలా ప్రవర్తించాడేంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే అతడి తీరును తప్పుబట్టారు. సెలబ్రిటీ అయ్యావని పొగరు చూపిస్తున్నావా? అంటూ కొందరు విమర్శలు చేశారు. దీంతో రాహుల్‌ తన కోపం వెనక ఉన్న బాధను బయట పెట్టాడు. "పొద్దున్నే నా కుడి కాలి చిటికెన వేలుకు ఆరు కుట్లు పడ్డాయి. అయినా ఓ 20 మంది నా కాలిని తొక్కేశారు. ఆ కుట్ల నుంచి రక్తం కారిపోతుంది. దీంతో ఎక్కడ కుట్లు ఊడిపోతాయో అని భయపడ్డాను. అంతే, కానీ మీ అందరికీ నా కోపం మాత్రమే కనబడుతుంది. ఏదేమైనా నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఓరుగల్లు జనాల వల్ల స్టోర్‌ వైభవంగా ప్రారంభించాం" అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. 

A post shared by Rahul Sipligunj (@sipligunjrahul)

చదవండి: ఆమెను అమాంతం ఎత్తుకున్న రాహుల్‌!

'ప్యాన్‌‌ ఇండియా’ను టార్గెట్‌ చేసిన చిరు, చెర్రీ, ప్రభాస్

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు