ఆమెను అమాంతం ఎత్తుకున్న రాహుల్‌!

17 Jan, 2021 13:14 IST|Sakshi

బిగ్‌బాస్‌ రియాలిటీ షో తర్వాత దశ తిరిగిపోయినవాళ్ల లిస్టులో సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ ముందు వరుసలో ఉంటాడు. బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ విజేతగా నిలిచిన ఆయనకు ఆ షో నుంచి అడుగు బయటపెట్టిన మరుక్షణమే ఎన్నో ఆఫర్లు వెల్లువలా వచ్చిపడ్డాయి. ఈ క్రమంలో రంగమార్తాండ చిత్రంలో నటించే అవకాశమూ రావడంతో సింగర్‌ రాహుల్‌ కాస్త యాక్టర్‌ రాహుల్‌గా పరిణామం చెందాడు. ఈమధ్యే బిజినెస్‌మెన్‌గానూ అవతరించాడు. తెలంగాణ యాసలో పాటలు పాడుతూ ఫేమస్‌ అయిన రాహుల్‌ ఇప్పుడు అదే యాసలోని పేరుతో కొత్త బిజినెస్‌ ప్రారంభించాడు. "ఊకో కాకా" పేరుతో బట్టల వ్యాపారం మొదలుపెట్టాడు. ఈ మధ్యే కరీంనగర్‌లో మొదటి షోరూమ్‌ను ప్రారంభించగా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇదే జోష్‌లో నేడు సాయంత్రం హైదరాబాద్‌లో కూడా స్టోర్‌ తెరుస్తున్నాడు. ఈ కార్యక్రమానికి బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అషూ రెడ్డి కూడా వచ్చేస్తోంది. ఈ విషయాన్ని రాహుల్‌ తన అభిమానులకు సోషల్‌ మీడియాలో వెల్లడించారు. (చదవండి: అభిమానుల‌కు షాకిచ్చిన పున్నూ బేబీ)

"నీ బలహీనతలు తెలిసినా కూడా బలాన్ని మెచ్చుకునేవాళ్లే నిజమైన స్నేహితులు.. ఊకో కాకా స్టోర్‌ ప్రారంభించేందుకు విచ్చేస్తున్న అషుకు స్వాగతం. మజాక్‌ కాదు, కాకా ఫ్రెండ్‌ అంటే ఇట్లుండాలె. ఇప్పుడు నాకింకా ధైర్యం వచ్చింది" అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. అంతా బానే ఉంది కానీ ఈ పోస్టుకు అషును ఎత్తుకున్న ఫొటోను జత చేశాడు. ఇంకేముందీ, అభిమానులు ఈ ఫొటోను తెగ షేర్లు చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. 'నిజంగా స్నేహితురాలైతే అలా ఎత్తుకుంటారా? మీది ఫ్రెండ్‌షిప్‌ అంటే ఒప్పుకోము, ఏదో తేడా కొడుతోంది. మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది..' అంటూ కొందు పబ్లిక్‌గానే గుసగుసలు పెడుతున్నారు. వీళ్ల వాలకం చూస్తుంటే కుచ్‌ కుచ్‌ హోతా హై అనిపిస్తోందని మరికొందరు వాళ్లకు వత్తాసు పలుకుతున్నారు. 'ఎహె.. ఫ్రెండ్‌ను ఎత్తుకోవడం కూడా తప్పేనా? దానికే ఏదో అయిపోయినట్లు తెగ ఫీల్‌ అవుతారేంటి? మా రాహుల్‌ అన్నను ప్రశాంతంగా ఉండనివ్వరా?' అని ఆయన వీరాభిమానులు గరమవుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతానికైతే తమది ఫ్రెండ్‌షిప్పే అన్నట్లుగా పోస్ట్‌ పెట్టాడు రాహుల్‌. చూడాలి మరి.. మున్ముందు కూడా అది స్నేహంగానే ఉంటుందా? కొత్త పుంతలు తొక్కుతుందా? అని! (చదవండి: సినిమా రివ్యూ: ఈ అల్లుడు బెదుర్స్‌!)

A post shared by Rahul Sipligunj (@sipligunjrahul)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు