Disha Parmar-Rahul Vaidya: తండ్రైన బిగ్‌బాస్‌ నటుడు.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్!

21 Sep, 2023 07:48 IST|Sakshi

సింగర్, బిగ్‌బాస్‌-14 కంటెస్టెంట్‌ రాహుల్ వైద్య, బుల్లితెర నటి దిశా పర్మార్ తల్లిదండ్రులయ్యారు. ఈ జంట గతంలో చాలా సార్లు ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఫోటోలు షేర్ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం దిశా పర్మార్‌ పండంటి బిడ్డకు జన్మినిచ్చింది. ఈ విషయాన్ని తమ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.  ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ సినీ తారలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం బేబీ, తల్లి ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడించారు. వినాయక చవితి సందర్భంగా మా ఇంటికి బిడ్డ రావడం సంతోషంగా ఉందని అన్నారు. 

(ఇది చదవండి: ముగిసిన మీరా అంత్యక్రియలు.. బోరున విలపించిన విజయ్ దంపతులు!)

ఇన్‌స్టాలో రాస్తూ..'మా ఇంటికి లక్ష్మీ తల్లి వచ్చింది. మమ్మల్ని ఆ దేవుడు ఆడబిడ్డతో ఆశీర్వదించాడు. మమ్మీ, బిడ్డ ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు అండగా నిలిచిన వైద్యులకు మా కృతజ్ఞతలు. మాకు  ఉత్తమమైన సేవలు అందించినందుకు  మా కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సంతోషకరమైన సమయంలో మా పాపను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం.' అంటూ పోస్ట్ చేశారు. అంతే కాకుండా ఏనుగు బొమ్మతో ఉన్న కార్టూన్‌ ఫోటోను షేర్ చేశారు. గణేశ్ చతుర్థి సందర్భంగా పాప పుట్టడంతో అలా ఆనందాన్ని పంచుకున్నారు. మీ ఇంటికి గణేష్‌తో పాటు మీరు లక్ష్మీ దేవిని కూడా స్వాగతించారు అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. 

కాగా.. టీవీ రియాలిటీ షో బిగ్ బాస్- 14లో 2020లో ఆమె పుట్టినరోజు సందర్భంగా దిశాకు రాహుల్ ప్రపోజ్ చేశాడు.రాహుల్ వైద్య, దిశా పర్మార్ జూలై 16, 2021న ముంబైలో వివాహం చేసుకున్నారు. సింగింగ్ రియాలిటీ షో అయిన ఇండియన్ ఐడల్ మొదటి సీజన్‌లో రాహుల్ కనిపించారు. అతను కేహ్ దో నా, తేరా ఇంతేజార్, యాద్ తేరీ వంటి పాటలు పాడారు. అంతే కాకుండా ఖత్రోన్ కే ఖిలాడీ  సీజన్‌- 11లో కూడా పాల్గొన్నాడు. దిశా పర్మార్ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి.. ఆ తర్వాత టీవీ షో ప్యార్ కా దర్ద్ హై మీఠా మీఠా ప్యారా ప్యారాలో నకుల్ మెహతా సరసన నటించింది. దిశా వో అప్నా సా షోలో కూడా కనిపించింది. ఆమె నటించిన బడే అచ్చే లాగ్తే హై- 2తో ఫేమ్ తెచ్చుకుంది. 

(ఇది చదవండి: నోరుజారిన డాక్టర్‌బాబు.. రెచ్చిపోయి ఛాలెంజ్ చేసిన శోభా)

A post shared by RAHUL VAIDYA (@rahulvaidyarkv)

మరిన్ని వార్తలు