బాలీవుడ్‌ కొత్త జంట ఎంగేజ్‌మెంట్‌.. డ్యాన్స్ చేసిన వీడియో వైరల్‌

14 Nov, 2021 15:09 IST|Sakshi

బాలీవుడ్ నటులు రాజ్‌ కుమార్ రావ్, పత్రలేఖల నిశ్చితార్థం ఇటీవల చండీగఢ్‌లో వారి సన్నిహితుల మధ్య జరిగింది.  ఆ వేడుకల నుంచి అనేక ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. తాజాగా రాజ్ కుమార్‌ రావు, పత్రలేఖ ఎంగేజ్‌మెంట్‌లో చేసిన డ్యాన్స్‌ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రాజ్‌ కుమార్ రావు, పత్రలేఖ జంత పూర్తిగా తెల్లని దుస్తుల్లో కనిపించారు. వైట్‌ అండ్‌ సిల్వర్‌ షిమ్మర్‌ సైడ్‌ స్లిట్‌ గౌన్‌ను పత్రలేఖ వేసుకుంటే, తెల్లటి ఇండియన్‌ ఫ్యూజన్‌ దుస్తులు ధరించారు. 

రాజ్‌ కుమార్‌ తన ప్రేమకు ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ను మోకాళ్లపై కూర్చొని బహుకరించాడు . తర్వాత పత్రలేఖ కూడా మోకాళ్లపై కూర్చొని రాజ్‌ కుమార్‌ వేలుకు ఉంగరాన్ని తొడిగింది. జంట ఉంగరాలు మార్చుకున్న తర్వాత ఈద్‌ షెరీన్‌ పాడిన పర్ఫెక్ట్‌ సాంగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ప్లే అవడం ప్రారంభమైంది. దీంతో రాజ్‌ కుమార్‌, పత్రలేఖ ఇద్దరు డ్యాన్స్‌ చేస్తూ కనువిందు చేశారు. వారి నృత్యంతో అతిథులను అలరిస్తూ ఉత్సాహపరిచారు. 

A post shared by Viral Bhayani (@viralbhayani)

మరోవైపు, వారు అతిథులతో కలిసి పోజులిచ్చిన అనేక ఫొటోలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఆ ఫొటల్లో ఎంగేజ్‌మెంట్‌ కోసం జంట వేసుకున్న వైట్‌ డ్రెస్ థీమ్‌కు అనుగుణంగా హోటల్‌లని వైట్‌ లైట్‌లతో అలంకరించడం చూడొచ్చు.  ఈ వేడుకల్లో నటుడు సాకిబ్‌ సలీమ్‌, నిర్మాత ఫరా ఖాన్‌ కూడా పాల్గొన్నారు.  వివాహానికి పత్రలేఖ సబ్యసాచి ఔట్‌ఫిట్‌ను వేసుకుంటుందని ఆమె స్నేహితురాలు ఒకరు చెప్పినట్టు సమాచారం. 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ఈ సబ్యసాచి వేర్‌ను ధరించిన వారిలో దీపికా పదుకొణె, అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా, బిపాస బసు ఉన్నారు. 2014లో 'సిటీలైట‍్స్‌' చిత్రంలో స్క‍్రీన్‌ షేర్ చేసుకన్న ఈ జంట చాలా కాలంగా డేటింగ్‌లో ఉందని పుకార్లు వచ‍్చాయి. అయితే ప్రస్తుతం వీరి పెళ్లి తేది గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 

మరిన్ని వార్తలు