రాజ్‌కుమార్‌ రావు కొత్త చిత్రం 'బదాయి దో' విడుదల ఎప్పుడంటే..?

16 Nov, 2021 14:51 IST|Sakshi

నవంబర్‌ 15న వివాహం చేసుకున్న బాలీవుడ్‌ హీరో రాజ్‌ కుమార్ రావు తన కొత్త సినిమాతో అభిమానులను అలరించనున్నారు. రాజ్‌ కుమార్‌ రావు, భూమి పెడ్నేకర్ తొలిసారి జంటగా నటించిన చిత్రం 'బదాయి దో'. హర్షవర్ధన్‌ కులకర్ణి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 4, 2022న థియేటర్లలో సందడి చేయనుంది. 'బదాయి దో' జాతీయ అవార్డు గెలుచుకున్న కామెడీ డ్రామా చిత్రం బదాయి హోకి సీక్వెల్‌గా వస్తోంది. 

ఈ సినిమా రిలీజ్‌ గురించి సోషల్‌ మీడియా వేదికగా హీరోయిన్‌ భూమి పడ్నేకర్ వెల్లడించారు. 'బదాయి దో ఇప్పుడు ఫిబ‍్రవరి 2022లో థియేటర్లలో విడుదల కానుంది. పెద్ద స్క్రీన్‌పై ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను చూసేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాం. సినిమాలో కులుద్దాం' రాసుకొచ్చారు. బధాయి దో సెట్స్‌ నుంచి ఫొటోలను కూడా ఆమె పోస్ట్‌ చేశారు. తాము సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు ప్రకటించారు. 

A post shared by Bhumi 🌻 (@bhumipednekar)

ఈ చిత్రంలో మహిళా ఠాణాలో ఉన్న ఏకైక పురుష పోలీసు అధికారి శార్దూల్‌ పాత్రలో రాజ్‌కుమార్‌ రావు నటించారు. మరోవైపు భూమి పడ్నేకర్ ఒక పీటీ టీచర్‌ సమీ పాత్రలో కనువిందు చేయనున్నారు. బదాయి దోలోని కథ, పాత్రలు 2018లో వచ్చిన బదాయి హో సినిమాకు విభిన్నంగా ఉండనున్నాయట. ఈ చిత్రానికి బదాయి హోకి సహ రచయితలుగా పని చేసిన సుమన్‌ అధికారి, అక్షత్‌ గిల్డియాల్‌ కథను అందించారు.   

A post shared by Bhumi 🌻 (@bhumipednekar)

మరిన్ని వార్తలు