వీవీఐటీలో హీరో కార్తికేయ సందడి 

11 Nov, 2021 11:29 IST|Sakshi
సెల్ఫీలు దిగుతూ విద్యార్థులతో కలసి సందడి చేస్తున్న హీరో కార్తికేయ

Raja Vikramarka Movie Team: శ్రీ చిత్ర మూవీ మేకర్స్‌ పతాకంపై శ్రీసరిపల్లి  నూతన దర్శకుడుగా పరిచయమవుతూ ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌ కార్తికేయ కధానాయకుడిగా తాన్యా రవిచందన కధానాయికగా నటిస్తున్న చిత్రం రాజా విక్రమార్క చిత్ర యూనిట్‌ వీవీఐటీలో సందడి చేసింది. పొన్నూరు నియోజకవర్గంలోని పెదకాకాని మండలం నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాలను బుధవారం రాజా విక్రమార్క చిత్రయూనిట్‌ సందర్శించింది.

ఈ సందర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ అన్ని రకాల సాంకేతిక హంగులతో రూపొందించి అందరినీ ఆకట్టుకునేలా దర్శకుడు శ్రీసరిపల్లి సినిమాని తెరకెక్కించారన్నారు. ఇప్పటికే విడుదలైన చిత్ర సంగీతానికి మంచి స్పందన లభించిందన్నారు. తన తొలి చిత్రం నుంచి ప్రచారంలో భాగంగా వీవీఐటీని సందర్శించడం పరిపాటిగా మారిందన్నారు.

దర్శకుడు శ్రీసరిపల్లి మాట్లాడుతూ మంచికథతో ప్రేక్షకులకు పరిచయవ్వడం సంతోషంగా ఉందని, నవంబరు 12న విడుదల కానున్న రాజా విక్రమార్క చిత్రం తప్పక విజయం సాధిస్తుందన్నారు. హీరో కార్తికేయ విద్యార్థులతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వై.మల్లికార్జునరెడ్డి, చిత్ర నిర్మాత రామారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు   పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు