SS Rajamouli: ఆర్‌ఆర్‌ఆర్‌పై బ్రిటిషర్ల విమర్శలు, రాజమౌళి స్ట్రాంగ్‌ కౌంటర్‌

22 Sep, 2022 16:45 IST|Sakshi

దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్‌  మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మార్చి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. అన్నివర్గా ప్రేక్షకులను మెప్పించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్ల వసూళు చేసి రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే ఈ మూవీపై కొందరు బ్రిటిష్‌ నెటిజన్లు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. తమను తక్కువ చేసిన చూపించారంటూ విమర్శలు రావడంతో తాజాగా వాటిపై స్పందించారు జక్కన్న.

చదవండి: ‘సీతారామం’ చూసిన ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌.. హీరోయిన్‌ గురించి ఏమన్నదంటే..

ఈ సినిమాలో బ్రిటిషన్లని విలన్లుగా చూపించినంత మాత్రాన బ్రిటిషర్స్‌ అందరూ విలన్స్‌ అయిపోరని, ఒకవేళ అందరూ అలాగే అనుకుంటే బ్రిటన్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ ఘన విజయం సాధించేది కాదంటూ తనదైన శైలిలో స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. అలాగే ‘స్క్రీన్‌పై ఆర్ఆర్ఆర్ సినిమాకు ముందు వచ్చే గమనిక(డిస్ల్కైమర్‌) అందరు చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ అనేది ఓ సినిమా కథ మాత్రమే. పాఠం కాదు. ఈ విషయం సినిమాలో నటించిన నటీనటులందరికీ తెలుసు. సినిమా చూసిన ప్రేక్షకులకు కూడా విషయం అర్థమై ఉంటుంది. అయితే.. ఓ స్టోరీ టెల్లర్‌గా ఈ విషయాలన్నీ అవగాహన ఉంటే.. వేరే విషయాల గురించి ఆలోచన చేసే అవసరం లేదు’ అంటూ రాజమౌళి వివరణ ఇచ్చారు.

చదవండి: ప్రియుడితో శ్రీసత్య ఎంగేజ్‌మెంట్‌ బ్రేక్‌.. అసలు కారణమిదే!

ఒక ట్రోలర్స్‌ను ఉద్దేశిస్తూ సినిమాను.. సినిమాగానే చూడాలని, అప్పుడే దాన్ని ఎంజాయ్‌ చేయగలుగతారంటూ జక్కన్న సూచించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ ఆస్కార్‌ నామినేషన్‌పై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్‌ను ఆస్కార్స్‌కు పంపకుండా ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా గుజరాతి చిత్రం ఛైలో షోను నామినేట్‌ చేయడం పట్ల సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే అమెరికాలో ఆర్‌ఆర్‌ఆర్‌ను డిస్ట్రిబ్యూట్‌ చేఇసన వేరియల్స్‌ ఫిలిం సంస్థ ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కాన్ నామినేషన్స్‌కు పరిశీలించాలని ఆకాడమిని కోరింది. అన్ని కేటగిరీలకు సంబంధించి ఓటింగ్‌ నిర్వహించేలా ప్రణాళిక రచిస్తోంది. 

మరిన్ని వార్తలు