RRR First Glimpse: ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి ఫస్ట్‌ గ్లింప్స్‌ వీడియో రిలీజ్‌

1 Nov, 2021 10:52 IST|Sakshi

RRR Movie First Glimpse Released: దిగ్గజ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌( ‘రౌద్రం.. రణం.. రుధిరం’).రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి ఫ్యాన్స్‌కు అదిరిపోయో ట్రీట్‌ ఇచ్చారు మూవీ మేకర్స్‌. ఈ సినిమా నుంచి ఫస్ట్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. 45సెక్లన పాటు కొనసాగిన ఈ వీడియో రిలీజ్‌ అయిన కాసేపటికే ట్రెండింగ్‌లో నిలిచింది. ముఖ్యంగా కీరవాణి బీజీఎం స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. 

ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషించారు. డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాత.  ఈ ప్రతిష్టాత్మక చిత్రం 2022 జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది.

చదవండి: పునీత్‌కి మాటిస్తున్నాను.. ఆ పిల్లలను నేను చదివిస్తా: విశాల్‌
పునీత్‌ మరణం: లైవ్‌లో న్యూస్‌ చదువుతూ ఏడ్చేసిన యాంకర్‌

>
మరిన్ని వార్తలు