అమెరికాలో ఫ్యాన్స్‌ను కలిసిన రజనీ, ఫొటోలు వైరల్‌

30 Jun, 2021 16:18 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఆమెరికాలోని ఆయన అభిమానులను కలిసిన ఫొటోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇటీవల జనరల్‌ చెకప్‌లో భాగంగా భార్యతో కలిసి అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలోని వెస్ట్‌ వర్జీనియాలో అభిమానులను కలిసి ముచ్చటిచ్చారు. అనంతరం వారితో కలిసి తీసుకున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారాయి. కాగా 2016లో రజనీ ఇక్కడే కిడ్నీ మార్పిడి సర్జరీ చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన జనరల్‌ చెకప్‌ కోసం అమెరికాకు రెగ్యూలర్‌గా వెళుతుంటారు.

ఈ క్రమంలో ఇటీవల భార్య లతతో కలిసి అమెరికాకు పయనమవగా, కూతురు ఐశ్వర్య, అల్లుడు ధనుష్‌, వారి పిల్లలు కొన్ని నెలలుగా అమెరికాలోనే ఉంటున్నారు. అయితే రజనీ ఆరోగ్యంపై రచయిత వైరముత్తు ఓ స్టేట్‌మెంట్‌ ఇస్తూ ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే తిరిగి ఇండియాకు రానున్నారని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా రజనీ అమెరికా పయనంపై నటి కస్తూరి వరుస ట్వీట్‌లతో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆమె తాజా ట్వీట్‌లో ‘గత మే నెల నుంచి భారతీయులు అమెరికా వెళ్లడంపై నిషేధం విధించింది. ఎలాంటి హెల్త్‌ ఎమర్జేన్సీ అయినా ఇండయన్స్‌ అమెరికాలో అడుగు పెట్టడానికి వీల్లేదని ఆంక్షలు విధించింది. ఇలాంటి సమయంలో రజనీ అంత అర్జేంట్‌కు అమెరికా ఎందుకు వెళ్లినట్లు. ఇక్కడ హస్పీటల్స్‌ లేవా. జనరల్‌ చేకప్‌యే కదా అది ఇక్కడ చేయించుకోరాదా?. ఆయన రాజకీయ ప్రవేశం గురించి తప్పించుకునేందుకే ఆయన అమెరికా వెళ్లినట్టు ఉంది. ఆయన దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా నాన్చుతూనే ఉన్నారు. ప్లీజ్‌ త్వరలో మీ పొలిటికల్‌ ఎంట్రీపై ఓ స్ఫష్టత ఇవ్వండి రజనీ సర్‌’ అంటూ కస్తూరి రాసుకొచ్చారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు