‘రాజన్న’ మూవీ చిన్నారి.. ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుందో తెలుసా!

18 Jun, 2021 15:29 IST|Sakshi

దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళీ తండ్రి కేవీ విజయేంద్ర ప్రసాద్‌ దర్శకత్వంలో హీరో నాగార్జున అక్కినేని లీడ్‌రోల్‌ వచ్చిన మూవీ ‘రాజన్న’. ఇందులో నాగార్జున స్వంతంత్య్ర సమరయోధుడు రాజన్నగా కనిపించగా ఆయనకు భార్యగా నటి స్నేహ నటించింది. 2011లో వచ్చిన ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది, ఇక ఇందులో రాజన్న కూతురు మల్లమ్మగా నటించిన ఆ చిన్నారి తన నటనతో ప్రేక్షకులను విపరితంగా ఆకట్టుకుంది. శత్రువులను ఎదురించి తన తండ్రి జాడ తెలుసుకునేందుకు ఆమె చేసే ప్రయత్నం ఇప్పటికి ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. ఇక మల్లమ్మగా తన తండ్రి రాజన్న చేసిన పోరాటాన్ని, త్యాగాన్ని పాటల రూపంలో తెలుపుతూ ఇతరులలో స్ఫూర్తిని నింపుతుంది.

అలా అంతగా తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆ చిన్నారి అసలు పేరు అనీ. ఈ సినిమాకు గాను బెస్ట్‌ చైల్డ్‌ ఆరిస్టుగా నంది అవార్డు గెలుచుకున్న అనీ ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా!. కాగా రాజన్న మూవీ సమయంలో అనీ వయసు 10 ఏళ్లు.  ఆమె నాలుగేళ్ల వయసు నుంచే చైల్డ్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ స్టార్ట్‌ చేసింది. ‘అనుకోకుండ ఒకరోజు’ మూవీతో టాలీవుడ్‌ అరంగేట్రం చేసిన అనీ ఆ తర్వాత తెలుగు సీరియల్ గోరింటాకుతో పాటు పలు సీరియల్స్‌లో నటించింది. ఇక చివరగా ‘రంగస్థలం’ మూవీలో చిట్టిబాబుకు(రామ్‌ చరణ్‌) చెల్లి పాత్రలో కనిపించిన బేబీ అనీ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అవినాష్‌ డిగ్రీ కాలేజీలో కామర్స్‌ చదువుతుంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు