ఆ సమయంలో శివానీ బాగా ఏడ్చేసింది.. ఎప్పుడూ మర్చిపోను : రాజ శేఖర్‌

19 Dec, 2021 16:01 IST|Sakshi

‘నాకు కరోనా సోకినప్పుడు భయపడలేదు. కానీ నా కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారు. ‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’మూవీ టీమ్‌ నుంచే శివానికి కోవిడ్‌ సోకింది. ఆమె నుంచి నాకు వచ్చింది. ఆ సమయంలో శివాని చాలా బాధపడింది. నా వల్లే డానీకి కరోనా సోకిందని ఏడ్చేసింది. ఆ జీవితాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను’అన్నారు సీనియర్‌ హీరో రాజశేఖర్‌. అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'(ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు). సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ‌ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహన్ ద‌ర్శ‌కత్వంలో రామంత్ర క్రియేష‌న్స్ పతాకంపై  ప్రొడ‌క్ష‌న్ నెం.1గా డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్‌ 24 నుంచి  ప్రముఖ ఓటీటీ సోనిలివ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. తోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హీరో రాజ‌శేఖ‌ర్‌, జీవిత ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు.

ఈ సందర్భంగా రాజశేఖర్‌ మాట్లాడుతూ.. డా. రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘గుహన్ వండర్ ఫుల్ టెక్నీషియన్. గరుడ వేగలో మా పరిచయం జరిగింది. ఏజ్ డిఫరెన్స్ లేకుండా ఫ్రెండ్స్‌లా తిరిగాం. ఆయనతో  శివానీ సినిమా చేస్తుందని తెలియడంతో ఆనందమేసింది. సినిమా ఫాస్ట్‌గా వస్తుందని చెప్పారు. ఇప్పుడు కరెక్ట్ సమయానికి వస్తోంది. డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు అంటే నాకు జీవితంలో కొన్ని గుర్తుకువస్తాయి. కోవిడ్‌ను చూసి నేను భయపడలేదు. ఈ టీం నుంచే శివానికి కరోనా వచ్చింది. అక్కడి నుంచి నాకు వచ్చింది. నా వల్ల డాడీకి వచ్చిందని శివానీ బాగా ఏడ్చేసింది. ఈ జీవితాన్ని నేను ఎప్పుడూ మరిచిపోను. ఈ చిత్రం మా జీవితంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. మరిచిపోలేని ఈ సినిమా డిసెంబర్ 24న వస్తోంది. అద్భుతం సినిమాకు ఎంత మంచి పేరు వచ్చిందో.. ఈసినిమాకు కూడా అంత మంచి పేరు వస్తుందని అంటున్నారు. నాకు ఎంతో గర్వంగా ఉంది. నా పేరు నిలబెట్టిందని అందరూ అంటుంటే సంతోషంగా ఉంది. ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘చిన్నప్పుడు మా పిల్లలు ఎప్పుడూ షూటింగ్‌లకు వచ్చేవారు. రాజశేఖర్ అవుట్ డోర్‌కు వెళ్తే తీసుకెళ్లేవారు. అప్పుడు కెమెరా వెనక ఉండేవారు. ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చారు. ఊహ వచ్చాక సినిమాల్లోకి వస్తామని మాతో నేరుగా చెప్పేశారు. సినిమాల్లో సక్సెస్ కాకపోతే డిప్రెషన్‌లోకి వెళ్లొద్దు.. వేరే కెరీర్ ఎంచుకోవాలని అన్నాం. శివానీ నటించిన అద్భుతం సినిమా మంచి విజయం సాధించింది. నైలు నది అనే పాట నాకు చాలా ఇష్టం. ఒక సినిమా ఒక హీరో లేదా ఇద్దరు హీరోలుంటారు. కానీ ఈ సినిమాకు నలుగురు హీరోలు. అదిత్, గుహన్, సైమన్, నిర్మాత గారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. నేను సినిమా చూశాను. అదిత్ చాలా బాగా చేశాడు.  శివానీ కూడా కష్టపడి చేసింది. గుహ‌న్ గారు ఈ సినిమాను కేవలం 20 రోజుల్లో షూట్ చేశారు. అంత ఫాస్ట్‌గా ఎలా తీశారా? అని నేను షాక్ అయ్యాను. ఈ సినిమా త‌ప్ప‌కుండా అద్భుతంగా ఉండబోతోంది’ అని అన్నారు. అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్, ప్రియదర్శి, వైవా హర్ష, దివ్య, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సైమన్‌ కె. కింగ్ సంగీతం అందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు