రాజశేఖర్‌ ఆరోగ్యంపై శివాత్మీక ట్వీట్స్‌..

22 Oct, 2020 10:47 IST|Sakshi

హీరో రాజశేఖర్‌ కుటుంబానికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. రాజశేఖర్, ఆయన భార్య జీవిత, వాళ్ల కుమార్తెలు శివానీ, శివాత్మిక కోవిడ్‌ బారినపడ్డారు. ప్రస్తుతం వీరంతా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే వారి కుమార్తెలు శివాత్మిక, శివానీ వెంటనే కోలుకోగా.. రాజశేఖర్, జీవితలకు చికిత్స కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజశేఖర్‌ ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ఆయన కుమార్తె శివాత్మిక అరగంటలో రెండు ట్వీట్లు చేశారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉందంటూ శివాత్మిక మొదటి ట్వీట్‌ చేశారు. అందరి అభిమానంతో క్షేమంగా తిరిగొస్తారని ఆశిస్తున్నానని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. (చదవండి: మేం బాగానే ఉన్నాం)

మరి కాసేపటికే.. నాన్న బాగానే ఉన్నారంటూ... మరో ట్వీట్‌ చేశారు శివాత్మిక. కరోనా నుంచి కోలుకుంటున్నారంటూ రెండో ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక జీవితకు కూడా కరోనా నెగిటివ్‌గా వచ్చినట్లు తెలిసింది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు