ఫుల్‌ స్పీడ్‌లో రాజశేఖర్‌.. 92వ సినిమా అదేనట

6 Feb, 2021 09:52 IST|Sakshi

గతం ఫేమ్‌ దర్శకుడితో రాజశేఖర్‌ నెక్స్ట్‌ ఫిల్మ్‌

హీరో రాజ‌శేఖ‌ర్ వ‌రుసపెట్టి సినిమాలను అనౌన్స్ చేస్తూ అభిమానుల‌ని ఖుషి చేస్తున్నారు. రెండు రోజుల క్రితం రాజశేఖర్‌ పుట్టిన రోజు సందర్భంగా 91వ సినిమాగా రాబోతున్న శేఖర్‌ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్‌ను  రిలీజ్ చేసిన సంగతి తెలిసందే. తాజాగా త‌న 92వ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ చేశారు రాజ‌శేఖ‌ర్. ‘గ‌తం’ వంటి సూప‌ర్ హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన మేకర్స్‌ దర్శకత్వంలో రాజ‌శేఖ‌ర్ 92వ సినిమా చేయ‌నున్నారు. కిర‌ణ్ కొండ‌మ‌డుగ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది.

శివాణి-శివాత్మిక‌, సృజ‌న్, భార్గ‌వ‌, హ‌ర్ష సంయుక్తంగా నిర్మించ‌నున్నారు. 2021లో చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ తెలియ‌జేశారు. తాజాగా చిత్రానికి సంబంధించి విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో మందు గ్లాసు, క‌ళ్ళ‌ద్దాలు, బుల్లెట్స్, గ‌న్ , న్యూస్ పేప‌ర్ ఇవ‌న్నీ చూస్తుంటే ఈ మూవీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొంద‌నుంద‌ని, ఇందులో రాజ‌శేఖ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది.  

(చదవండి: రాజశేఖర్‌ హీరోగా ‘శేఖర్‌’.. ఫస్ట్‌లుక్)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు