హీరోయిన్‌గా ప్రముఖ డైరెక్టర్‌ కూతురు.. కీలక పాత్రలో సునీల్!!

24 Sep, 2023 14:54 IST|Sakshi

దర్శకుడు సెల్వరాఘవన్‌ నటుడిగా బిజీ అవుతున్నారు. చిన్న పాత్రలతో ప్రారంభమైన ఆయన నట జీవితం ఇప్పుడు హీరో స్థాయికి చేరుకుంది. తాజాగా పాన్‌ ఇండియా చిత్రంలో ప్రధానపాత్రను పోషిస్తున్నారు. మూమెంట్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ పతాకంపై జీఎం.హరికృష్ణన్‌, దుర్గాదేవి హరికృష్ణన్‌ నిర్మిస్తన్న ఈ చిత్రంలో నటుడు యోగిబాబు, టాలీవుడ్ నటుడు సునీల్‌, జేడీ చక్రవర్తి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. 

(ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్‌ కన్నుమూత!)

ఈ చిత్రంలో కొరియోగ్రాఫర్, దర్శకుడు రాజీవ్‌ మీనన్‌ వారసురాలు సరస్వతి మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రంగనాథన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 1990 ప్రాంతంలో దర్శకుడు కే.భాగ్యరాజ్‌ రూపొందించిన చిత్రాలు తమిళంలో విజయవంతమవడంతో పాటు పాన్‌ ఇండియా స్థాయిలో రీమేక్‌ అయి హిట్‌ అయ్యాయని, అలాంటి కథతో రూపొందించనున్న చిత్రమని దర్శకుడు తెలిపారు.

కథ, కథనాలు కొత్తగా ఉంటాయని, పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ చిత్ర కథను విన్న సెల్వరాఘవన్‌కు నచ్చడంతో ఇందులో ప్రధాన పాత్రలో నటించడానికి అంగీకరించారని అన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను ప్రస్తుతం దిండుగళ్‌ ప్రాంతంలో 1000 మంది సహాయ నటీనటులు పాల్గొంటున్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు. చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుందని తెలిపారు.

(ఇది చదవండి: సమంతలాగే అరుదైన వ్యాధితో బాధపడుతున్న నటి

A post shared by Saraswathi Menon (@sarasmenon)

మరిన్ని వార్తలు