కార్పొరేట్ సంస్థలు సామాజిక సేవలో భాగస్వాములు కావాలి: రాజేంద్రప్రసాద్‌

10 Apr, 2022 11:22 IST|Sakshi

సూచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డుల ప్రదానం

ధనం సంపాదించటమే ముఖ్యం కాదు, ఆర్జించిన సంపద లో కొంత వితరణ కోసం వెచ్చించాలని ప్రముఖ సినీ నటుడు డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు. ప్రముఖ సామాజిక సేవాసంస్థ సుచిరిండియా ఫౌండేషన్  నిర్వహించిన  29వ సర్ సివి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షలో విజయం సాధించిన వారికి రవీంద్ర భారతీలో అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్రప్రసాద్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థలు సామాజిక సేవ లో భాగ స్వాములు కావాలని కోరారు. పిల్లలు ఆట పాటలతో చదువుని ఇష్టంగా నేర్చుకోవాలన్నారు. విద్యార్థులను జాతి నిర్మాతలుగా దీర్చి దిద్దాల్చిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సినీనటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్‌ జేవీఆర్‌ సాగర్, ఎమ్మెల్యే  శ్రీధర్ బాబు , రీజినల్ పాస్ పోర్ట్  ఆఫీసర్ దాసరి బాలయ్య,  సూచిరిండియా ఫౌండేషన్ నిర్వహకులు లయన్ కిరణ్  తదితరులు పాల్గొన్నారు.


 
సామాజిక సేవాసంస్థ సుచిరిండియా ఫౌండేషన్ 29వ సర్ సివి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ, రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో నిర్వహించింది. 1000 పాఠశాలల నుంచి  పదివేల మంది విద్యార్థులు  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.దేశ వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించన 29వ జాతీయ స్థాయి సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షల్లో 16 మందికి గోల్డ్ మెడల్స్, 48 మంది కి నేషనల్ ర్యాంక్స్ & రాష్ట్రా స్థాయి మెడల్స్, 300 మందికి జిల్లా స్థాయి ర్యాంక్స్ , 10 మందికి గురుబ్రహ్మ ఛత్రాలయా అవార్డ్స్ పొందరాని నిర్వాహకులు తెలిపారు. 

మరిన్ని వార్తలు