పడ్డారండి ప్రేమలో మరి!

21 Dec, 2020 03:47 IST|Sakshi
రాజేంద్ర ప్రసాద్, జయప్రద

రాజేంద్ర ప్రసాద్‌ ప్రేమలో పడ్డారు.  ఇది లేటు వయసులో క్యూటు ప్రేమ అట. అయినా ప్రేమకు వయసేంటి?  ఈ ప్రేమ అంతా సినిమా కోసమే. రాజేంద్ర ప్రసాద్, జయప్రద ముఖ్య పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కనుంది. ‘లవ్‌ – 60’ టైటిల్‌. ఈ సినిమాకు వీయన్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తారు. అరవైలలో ప్రేమలో పడే జంటగా రాజేంద్ర ప్రసాద్, జయప్రద కనిపిస్తారు. ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ కోసం ఈ సినిమాను రూపొందించనున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు