ఈ కథ విన్నప్పుడు ఫ్రీజ్‌ అయ్యాను

7 Jun, 2022 05:20 IST|Sakshi
జగన్‌మోహన్, నరసింహరాజు, వెంకటేశ్, రాజేంద్రప్రసాద్, వేణుగోపాల్‌

– నటుడు రాజేంద్రప్రసాద్‌

‘‘ఇన్నేళ్ల నా కెరీర్‌లో ‘ఆ నలుగురు’, ‘మీ శ్రేయోభిలాషి’ కథలను విన్నప్పుడు షాకయ్యాను. కానీ దర్శకుడు వెంకటేశ్‌ ‘అనుకోని ప్రయాణం’ కథ చెప్పినప్పుడు ఫ్రీజ్‌ అయ్యాను’’ అని ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌ అన్నారు. పెదిరెడ్ల వెంకటేశ్‌ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్, నరసింహరాజు ప్రధాన పాత్రధారులుగా డా. జగన్‌మోహన్‌ నిర్మించిన చిత్రం ‘అనుకోని ప్రయాణం’. ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ సమర్పణలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘కరోనా సమయంలో వలస కూలీల ప్రయాణం నుంచి పుట్టిన కథ ఇది. ఇద్దరి స్నేహితుల కథ. నరసింహరాజుగారిలాంటి గొప్ప నటుడితో కలిసి యాక్ట్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని అన్నారు. ‘‘రాజేంద్రప్రసాద్‌గారిలాంటి వారు ఈ కథను ఒప్పుకున్నారంటేనే విజయం కింద లెక్క. డాక్టర్‌ అయిన జగన్‌మోహన్‌ నిర్మాణంలోకి రావడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు నరసింహరాజు. ‘‘రాజేంద్రప్రసాద్, నరసింహరాజు వంటి నటులు నా సినిమాలో నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు దర్శకుడు వెంకటేశ్‌.     

మరిన్ని వార్తలు