నయా కాంబినేషన్‌ 

28 Feb, 2024 00:01 IST|Sakshi
రజనీకాంత్, సాజిద్‌ నడియాడ్‌వాలా

రజనీకాంత్‌ ఇప్పటివరకూ దక్షిణ, ఉత్తరాది, హాలీవుడ్‌ మూవీ (బ్లడ్‌ స్టోన్‌) కలుపుకుని దాదాపు 170 చిత్రాల్లో నటించారు. ఇన్ని సినిమాలు చేసిన ఆయన గత కొన్నేళ్లుగా హిందీ నిర్మాతలతో సినిమాలు చేసింది లేదు. ఇప్పుడు అగ్రనిర్మాత సాజిద్‌ నడియాడ్‌వాలాతో సినిమా చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. హిందీలో ‘హౌస్‌ఫుల్‌ సిరీస్, 2 స్టేట్స్, హీరో పంతి, కిక్, సూపర్‌ 30, ఛిచోరే, 83’ తదితర చిత్రాలతో పాటు రీసెంట్‌ హిట్‌ ‘సత్య ప్రేమ్‌ కీ కథ’ చిత్రం నిర్మించారు సాజిద్‌ నడియాడ్‌వాలా.

‘హౌస్‌ఫుల్, హౌస్‌ఫుల్‌ 2, కిక్‌’ వంటి చిత్రాలకు దర్శకుడు కూడా. ఇప్పుడు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌–సాజిద్‌ల నయా కాంబినేషన్‌ సెట్‌ అయింది. ‘‘ఒక లెజండరీ నటుడితో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను’’ అని సామాజిక మాధ్యమాల ద్వారా పేర్కొన్నారు సాజిద్‌. కాగా ఇది హిందీ చిత్రమా లేక పాన్‌ ఇండియన్‌ ప్రాజెక్టా? ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు? వంటి విషయాలను సాజిద్‌ స్పష్టం చేయలేదు.

whatsapp channel

మరిన్ని వార్తలు