ఒకే వేదికపై మామ అల్లుడికి అవార్డులు 

4 Apr, 2021 07:01 IST|Sakshi

చెన్నై: మామ అల్లుళ్లు నటుడు రజినీకాంత్, ధనుష్‌ ఒకే వేదికపై ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకోవడానికి సిద్ధమవుతున్నారు. రజనీ, కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందే అసురన్‌ చిత్రంలో నటనకు, ఆయన అల్లుడు, ధనుష్‌ కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ప్రకటించింది. 67వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని మే 3న నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే వేదికపై  రజనీకాంత్‌ను దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులతో సత్కరించనున్నారు. ఇలా ఒకే వేదికపై మామ అల్లుళ్లు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకోవడం అరుదైన విషయమే.
చదవండి: ఒక అవార్డు... ఎన్నో ప్రశ్నలు!

మరిన్ని వార్తలు