Ilaiyaraaja: రాగాల సభ నుంచి రాజ్యసభకు..

7 Jul, 2022 10:19 IST|Sakshi

ఇళయరాజా.. ఈ పేరు చెబితే సంగీత సరస్వతి మది పులకిస్తుంది. స్వరాలు సగారాలాడుతాయి. దాదాపు 50 వసంతాలుగా సినీ ప్రియులను అలరిస్తున్న ఈ సంగీత దిగ్గజానికి అరుదైన ఘనత లభించింది. ఆయన్ని రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్‌ చేస్తున్నట్లు కేంద్రప్రభుత్వం బుధవారం వెల్లడించింది. అనేక తరాల సంగీతానికి ఆయన వారధి వంటి వారని, అనుసంధాన కర్తని కొనియాడింది. కాగా మదురై జిల్లా పన్నై పురం అనే కుగ్రామానికి హార్మోని పెట్టె పట్టుకుని చెన్నపట్నానికి వచ్చిన ఇళయరాజా 1976లో తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించారు.

చదవండి: ఖుష్బూ సుందర్‌కు కీలక బాధ్యతలు

అప్పటి నుంచి ఇప్పటి వరకు వందలాది చిత్రాలకు సంగీతం అందించి ఇసయజ్ఞానిగా కీర్తి పొందారు. కాగా ఈయనకు ఇప్పటికే పద్మవిభూషణ్‌ వంటి జాతీయస్థాయి అవార్డులను కూడా అందుకున్నారు. తాజాగా రాజ్యసభకు నామినేట్‌ కావడంతో సినీ, రాజకీయ ప్రముఖలతో పాటు ఇతరులు, అభిమానుల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు చెబుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇక సూపర్‌స్టార్‌ రజినీకాంత్, సీనియర్‌ దర్శకుడు భారతీరాజా తదితరులు అభినందించారు.

మరిన్ని వార్తలు