సూపర్‌ స్టార్‌ సినిమా రిలీజ్‌కు డేట్‌ ఫిక్స్‌

25 Jan, 2021 18:42 IST|Sakshi

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'అన్నాత్తే' సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ ఏడాది దీపావళి సందర్భంగా అన్నాతే థియేటర్లలలో విడుదల కాబోతున్నట్లు సన్‌ పిక్చర్స్ వెల్లడించింది. నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ట్విటర్‌లో పోస్టు పెట్టింది. ‘నవంబర్‌ 4న అన్నాత్తే సినిమా విడుదల కాబోతుంది. సిద్ధంగా ఉండండి అంటూ ట్వీట్‌ చేసింది. కాగా శివ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్నఈ సినిమాలో రజనీకి జోడీగా నయనతార నటిస్తున్నారు. అలాగే కీర్తీ సురేశ్‌, మీనా, కుష్భూ, ప్రకాష్‌ రాజ్ ‌ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉండగా తలైవా నటిస్తున్న 168వ సినిమా ఇది. ఇంతకముందు రజినీకాంత్‌ ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం  వహించిన  దర్బార్‌ సినిమాలో నటించారు. చదవండి: డీఎంకేలోకి తలైవా టీం .. చెప్పే వచ్చాం.. 

కాగా అనారోగ్యం కారణంగా కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు రజనీ. హైదరాబాద్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక చెన్నై వెళ్ళి అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. నిజానికి ఈ సినిమా కొన్ని రోజుల పాటు ఆగిపోయిందని, ఇప్పట్లో విడుదల కూడా కాదని సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అన్నట్లుగానే సమ్మర్‌లో వస్తుందనుకున్న సినిమా కాస్తా ఏడాది చివర్లోకి వెళ్లిపోయింది.మరోవైపు అన్నాత్తేలో రజినీ ఇంట్రో సాంగ్ దివంగత లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడారు. గతేడాది సమ్మర్‌లోనే సంగీత దర్శకుడు ఇమాన్ అన్నాత్తే పాటల రికార్డింగ్ పూర్తి చేసాడు. అందులో మొదటి పాటను బాలుతో పాడించాడు. ఈ పాటను త్వరలోనే విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు.

మరిన్ని వార్తలు