రజనీకాంత్‌ కొత్త సినిమా.. పాత్ర ఇదే

17 Apr, 2021 00:37 IST|Sakshi

క్లాస్, మాస్‌ మాత్రమే కాదు.. రజనీకాంత్‌ యాక్టింగ్‌ స్టైల్‌లో కామెడీ కూడా ఉంటుంది. కథను బట్టి తనలోని కామెడీని ప్రేక్షకులకు చూపిస్తారు రజనీ. ఇప్పుడు తన తాజా చిత్రం ‘అన్నాత్తే’ (పెద్దన్నయ్య) లో ఫుల్‌గా నవ్విస్తారట. మరి... రజనీ స్టైల్‌ యాక్షన్‌  అంటే.. అది కూడా ఉంటుంది. ఒకవైపు యాక్షన్‌ .. మరోవైపు కామెడీతో ఫ్యాన్స్‌కి పండగలా ఉంటుందట ఈ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాది దీపావళి సందర్భంగా నవంబర్‌ 4న విడుదల కానుంది.

మరిన్ని వార్తలు