ఆ దర్శకుడికి రజనీ మరో అవకాశం

22 Sep, 2021 10:19 IST|Sakshi

ఫేవరేట్ దర్శకులను రిపీట్ చేయడంలో సూపర్‌ స్టార్‌ రజనికాంత్‌ ఎప్పుడూ ముందుంటాడు. మేకింగ్ కూడా నచ్చితే ఇక డేట్స్ ఫుల్ గా కేటాయిస్తాడు. రీసెంట్ టైమ్స్ లో పారంజిత్ తో వరుసగా రెండు చిత్రాలు చేశాడు. ఇప్పుడు అదే ట్రెండ్ ను కంటిన్యూ చేస్తున్నారు. అన్నాత్తే దర్శకుడికే మరో అవకాశం ఇవ్వబోతున్నారట.

రజనీ హీరోగా నటిస్తున్న అన్నాత్తే షూటింగ్ పూర్తైంది. దీపావళికి ఘనంగా రిలీజ్ కు ముస్తాబవుతోంది. ఈ సినిమా పూర్తైన తర్వాత రజనీకాంత్ నటించే కొత్త చిత్రంపై కోలీవుడ్ లో రకరకాల రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.ఒకసారి పెరియా స్వామి అనే యంగ్ డైరెక్టర్ తో మూవీ చేయనున్నాడని మరోసారి సొంత అల్లుడు ధనుష్ కు అవకాశం ఇవనున్నారని వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. కాని రజనీ ఆలోచన వేరుగా ఉంది. ప్రస్తుతం అన్నాత్తేను డైరెక్ట్ చేసిన శివను మరోసారి తనని డైరెక్ట్ చేసేందుకు అవకాశం ఇచ్చారట.

అన్నాత్తే దర్శకుడు అంటే ఎవరో కాదు.. తెలుగులో శౌర్యం, శంఖం, దరువు చిత్రాలను తెరకెక్కించన దర్శకుడు. 2014లో కోలీవుడ్ వెళ్లి అక్కడ అజిత్ కు వరుసగా బ్లాక్ బస్టర్స్ అందించాడు. దాంతో స్టార్ డైరెక్టర్ గా మారాడు.ప్రస్తుతం కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారాడు.అందుకే ఈ దర్శకుడికి మరో అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడట సూపర్ స్టార్. స్టోరీ రెడీ చేస్తే డేట్స్ ఇస్తానని మాట ఇచ్చాడట.మరోవైపు శివ దర్శకత్వంలో నటించేందుకు సూర్య చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. అన్నాత్తేకు ముందు సెట్స్ పైకి వెళ్లాల్సిన సినిమా వీరిది. కాని రజనీకాంత్ కోసం డెట్స్ అడ్జెస్ట్ చేశాడు సూర్య. ఇప్పుడు తలైవా మరోసారి శివ డేట్స్ ను బ్లాక్ చేయబోతున్నారు. మరి సూర్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాల్సి ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు