వినాయక చవితికి రజనీకాంత్‌ ‘జైలర్‌’!

25 Apr, 2023 04:26 IST|Sakshi

గత ఏడాది రజనీకాంత్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించలేదు. 2021 నవంబర్‌లో ‘అన్నాత్తే’ (తెలుగులో ‘పెద్దన్నయ్య’)తో అలరించారు. సూపర్‌ స్టార్‌ సినిమా రిలీజై æ ఏడాదిన్నర అవుతోంది కాబట్టి ఆయన నటించిన తాజా చిత్రం ‘జైలర్‌’ కోసం ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ చిత్రం విడుదలవుతుందనుకున్నారు కానీ, రాలేదు. తాజా వార్తల ప్రకారం సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోందట.

రజనీకాంత్‌ పాత్ర చిత్రీకరణ మొత్తం పూర్తయిందని ఇటీవల ఈ చిత్రదర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ ఓ వేడుకలో స్పష్టం చేశారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో వినాయక చవితికి సినిమాని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారని, త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని కోలీవుడ్‌ ఫిల్మ్‌ సర్కిల్‌ అంటోంది. రజనీ సరసన తమన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, శివ రాజ్‌కుమార్, సునీల్, రమ్యకృష్ణ కీలక పాత్రలు చేశారు. మోహన్‌లాల్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారు. 

మరిన్ని వార్తలు