రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జైలర్’. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో శివరాజ్ కుమార్, మోహన్‌లాల్, జాకీష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ, తమన్నా, మీర్నా మీనన్ కీలక పాత్రలు పోషించారు. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్‌పై రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 10న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.
కాగా ఆదివారం ‘జైలర్’ నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. స్టైల్‌గా కారులో కూర్చున్న రజనీ మాస్ లుక్ ఆకట్టుకుంటోంది. కాగా రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న ‘లాల్‌సలామ్’ సినిమా షూటింగ్ కోసం ప్రస్తుతం ముంబైలో ఉన్నారు రజనీకాంత్. అలాగే ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కానుంది.