నేడు చెన్నైకి రానున్న తలైవా

8 Jul, 2021 07:23 IST|Sakshi

తలైవా రజనీకాంత్‌ గురువారం చెన్నైకి చేరుకోనున్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరీక్షల నిమిత్తం గత నెల 19న భార్య లతా రజనీకాంత్‌తో కలిసి అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ మయో క్లినికల్‌ ఆస్పత్రిలో రజనీకాంత్‌కు వైద్యులు పలు రకాల పరీక్షలు చేశారు. గురువారం వేకువజామున చెన్నైకు రానున్న నేపథ్యంలో రజనీకాంత్‌కు చెన్నై విమానాశ్రయంలో ఘన స్వాగతం పలకడానికి అభిమానులు సిద్ధమయ్యారు.

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం ‘అన్నాత్తే’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శివ దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవలే పూర్తైంది. దాంతో కరోనా లాక్‌డౌన్‌లాంటివి ఏమీ లేకపోతే ముందు అనుకున్నట్లుగానే చిత్రాన్ని నవంబర్‌ 4న విడుదల చేయనున్నట్లు సన్‌ పిక్చర్స్‌ వెల్లడించింది.

మరిన్ని వార్తలు