రజనీ నెక్స్ట్‌ మూవీ ఆమె డైరెక్షన్‌లోనేనా?!

7 Jul, 2021 21:07 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం ‘అన్నాత్తే’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన రజనీ రాజకీయ అరంగేట్రం, ఇటూ ఆయన నెక్ట్‌ మూవీ డైరెక్టర్‌ ఎవరన్నది హాట్‌ టాపిక్‌గా మారింది. ఎందుకంటే రజనీకి ఇటీవల ఎంతో మంది డైరెక్టర్‌లు కథ వివరించారట. అందులో యువ దర్శకులతో పాటు ఆయన కూతురు సౌందర్య కూడా ఉండటమే ఇందుకు కారణం. కాగా ప్రస్తుతం రజనీ నటిస్తున్న సినిమా, సినిమాకు ఇదే ఆయన చివరి మూవీ  అని త్వరలోనే నటకు గుడ్‌బై చెప్పబోతున్నట్లు పుకార్లు పుట్టుకోస్తున్నాయి. అంతేగాక ఆయన రాజకీయ ప్రవేశంపై కూడా రూమార్లు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆయన కోసం కూతురు సౌందర్య స్క్రిప్ట్‌ సిద్దం చేయడంతో మరీ రజనీ తదుపరి చిత్రం ఎవరీ డైరెక్షన్‌లో అనేది చర్చనీయాంశం మారింది.  అయితే ఆయన చివరిగా కూతురు డైరెక్షన్‌ నటించి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. అంతేగాక ఆయన అమెరికా నుంచి తిరిగి రాగానే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని తెలుస్తోంది. కాగా ఇప్పటికే సౌందర్య రజనీతో యానిమేటెడ్‌ మూవీని డైరెక్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు