Rajinikanth Review On Godfather: ‘గాడ్‌ఫాదర్‌’పై సూపర్‌ స్టార్‌ రజనీ రివ్యూ.. ఏమన్నారంటే

11 Oct, 2022 10:40 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన లేటెస్ట్‌ మూవీ ‘గాడ్‌ ఫాదర్‌’ బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. దసరా సందర్భంగా అక్టోబర్‌ 5న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ ఈ మూవీ మంచి వసూళ్లను రాబడుతోంది. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా గాడ్‌ఫాదర్‌ చూసిన సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సినిమాను బాగా ఎంజాయ్‌ చేసినట్లు తెలుస్తోంది. గాడ్‌ఫాదర్‌ చూసి రజనీకాంత్‌ తన రివ్యూ ఇచ్చారని, ఇది తనకు బెస్ట్‌ మూమెంట్‌ అంటూ  డైరెక్టర్‌ మోహన్‌ రాజా ఆనందం వ్యక్తం చేశాడు.

చదవండి: తల్లిదండ్రులైన మరుసటి రోజే నయన్‌ దంపతులకు షాక్‌!

ఈ మేరకు మోహన్‌ రాజా ట్వీట్‌ చేస్తూ.. ‘సూపర్‌ స్టార్‌ ‘గాడ్‌ఫాదర్‌’ సినిమా చూశారు. ఈ మూవీ చాలా చాలా బాగుంది అన్నారు. ప్రత్యేకంగా తెలుగు వెర్షన్‌ కోసం చేసిన అనుసరణలు అద్భుతంగా ఉన్నాయని ఆయన కొనియాడారు. ధన్యవాదాలు తైలవా(రజనీకాంత్‌) సార్‌, నా జీవితంలోని అత్యుత్తమ క్షణాలలో ఇది ఒకటి’ అంటూ మురిసిపోయాడు. కాగా డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించిన ఈ మూవీలో నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్ కీలకపాత్రల్లో నటించారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు గాడ్‌ ఫాదర్‌ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లు పైగా వసూలు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 

మరిన్ని వార్తలు