వివాహం చేసుకోబోతున్న బాలీవుడ్‌ హీరో.. సన్నిహితులకే ఆహ్వానం

10 Nov, 2021 16:35 IST|Sakshi

బాలీవుడ్‌ నటుడు రాజ్‌ కుమార్ రావు త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు, నటి పత్రలేఖను పెళ్లి చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే వీరి వివాహం వీరికి సంబంధించిన అతి సన్నిహితుల సమక్షంలో జరగనుందట. వీరి వివాహ వేడుక చండీగఢ్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి పత్రలేఖ కుటుంబం ఇప్పటికే చేరుకుందట. త్వరలో రాజ్‌ కుమార్‌ కుటంబం హాజరు కానుందని సమాచారం. అయితే కొవిడ్ కారణంగా వివాహాన్ని ఎలాంటి ఆర్బాటం లేకుండా, ప్రవేట్‌గా నిర్వహించాలనుకున్నారు. అందుకే సినీ ఇండస్ట్రీలోని అతి సన‍్నిహితులను మాత‍్రమే ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. 

A post shared by RajKummar Rao (@rajkummar_rao)

చాలా కాలంగా కలిసి ఉంటున్న రాజ్ కుమార్‌, పత్రలేఖ తమ పెళ్లి పుకార్ల గురించి ఎప్పుడు అధికారికంగా ప్రకటించలేదు. అయితే కొన్ని రోజులుగా ఈ జంట నవంబర్ 11-13 మధ్య వివాహం జరగనుందని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయట. రాజ్‌ కుమార్‌.. పత్రలేఖను తొలిసారిగా ఒక ప్రకటనలో చూశాడు. లవ్‌ ఎట్ ఫస్ట్‌ సైట్‌లా తన మనసు పత్రలేఖకు ఇచ్చేశాడు. నిజ జీవితంలో ఆమెను కలవాలని గట్టిగా కోరుకున్నాడు. ఇంకే.. నెల రోజుల తర్వాత కట్‌ చేస్తే డైరెక్ట్‌గా ఆమెను కలుసుకున్నాడు. తర్వాత ఇద్దరు మాట్లాడుకోవడం, ఒకరితో ఒకరు ప్రేమలో పడిపోవడం వెనువెంటనే జరిగిపోయాయి. ఇప‍్పటికీ వారు ఏడేళ్లకుపైగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. 

A post shared by 🌸 Patralekhaa 🌸 (@patralekhaa)

పత్రలేఖ 2014లో సిటీలైట్స్‌లో రాజ్‌కుమార్ రావు సరసన బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఈ సమయానికి, రాజ్‌కుమార్ విమర్శకుల ప్రశంసలు పొందిన కై పో చే!, షాహిద్, ఒమెర్టా, అలీగర్, లవ్ సోనియా వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. లవ్, సెక్స్ ఔర్ ధోఖాతో రాజ్‌కుమార్ రావు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. 2013లో విడుదలైన కై పో చే! చిత్రంలో అతనిది అద్భుతమైన పాత్ర.  షాహిద్‌లో తన పాత్రకు ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నాడు. రాజ్‌ కుమార్‌ చేసిన ఇటీవలి చిత్రాలు హమ్ దో హమారే దో, రూహి.

మరిన్ని వార్తలు